
తమిళ సినిమా బాక్సాఫీస్ కింగ్ దళపతి విజయ్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటివరకు 69 సినిమాల్లో నటించారు.
వాటిలో ఎన్నో రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వసూళ్లలో విజయ్ను మించిన వారు లేరనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఆయనో ప్రత్యేక సామ్రాజ్యాన్ని నడిపారు. ఈ నేపథ్యంలో, ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలేంటో ఈ గ్యాలరీలో చూద్దాం.
విజయ్ - ఏ.ఆర్. మురుగదాస్ కాంబోలో వచ్చిన సినిమా 'కత్తి'. వీరి కాంబినేషన్లో వచ్చిన 'తుపాకి' బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ సినిమా వచ్చింది. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు వసూలు చేసి విజయ్ టాప్ 10 మూవీస్‌లో 10వ స్థానంలో నిలిచింది.
విజయ్ కెరీర్లో భారీ హైప్‌తో వచ్చిన సినిమా 'బీస్ట్'. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదట భారీ అంచనాలున్నాయి. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద రూ.215 కోట్లు వసూలు చేసింది.
విజయ్ హీరోగా 2023లో విడుదలైన సినిమా 'వారసుడు' (తమిళంలో వారిసు). తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.306 కోట్లు వసూలు చేసింది.
విజయ్ - అట్లీ కాంబినేషన్లో 2019లో దీపావళికి విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం 'బిగిల్'. ఈ సినిమాలో విజయ్, బిగిల్, రాయప్పన్ అనే రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.321 కోట్లు వసూలు చేసింది.
విజయ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లు వసూలు చేసింది. త్వరలో విడుదల కానున్న విజయ్ 'జననాయగన్' సినిమా ఈ రికార్డును బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కోలీవుడ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా విజయ్ నిలిచారని చెప్పొచ్చు.