
Holidays : వేసవి సెలవులు ముగిసి వారంరోజులు కూడా కాలేదు... అప్పుడే మళ్లీ వరుస సెలవులు వస్తున్నాయి. ఈ వారంలో ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు...
Holidays : వేసవి సెలవులు ముగిసి వారంరోజులు కూడా కాలేదు... అప్పుడే మళ్లీ వరుస సెలవులు వస్తున్నాయి. ఈ వారంలో ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. వేసవి సెలవులు ముగిశాయని బాధపడుతూ భారంగా బడిబాట పట్టిన విద్యార్థులకు ఈ సెలవులు కాస్త ఊరట ఇవ్వనున్నాయి. అయితే కేవలం విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు రాబోతున్నాయి. ఈ వారంలో ఏరోజు వర్కింగ్ డే? ఎన్నిరోజులు, ఎందుకు సెలవు?
నిన్న (జూన్ 21) ఆదివారం కాబట్టి విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవే. ఇవాళ (జూన్ 22) సోమవారం వర్కింగ్ డే.. అంటే స్కూళ్లు, ఆఫీసులు యధావిధిగా పనిచేస్తాయి. ఈ మంగళవారం (జూన్ 23న) తెలంగాణ విద్యార్థులకు సడన్ గా సెలవు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ బుధవారం (జూన్ 24న) స్కూళ్లు, ఆఫీసులు పనిచేస్తాయి... ఆ తర్వాతే అసలు సెలవులు షురూ అయ్యేది. జూన్ 25 నుండి 28 వరకు వరుస సెలవులు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో రెండ్రోజులే వర్కింగ్ డేస్... మిగతా ఆరురోజులు సెలవులే... ఇందులో రెండు ఆదివారాలు పోగా నాలుగు రోజుల సెలవులు ఎక్స్ట్రాగా వస్తున్నాయి.
తెలంగాణ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బిజెపి విద్యార్థి విభాగం ABVP (అఖిల భారత విద్యార్థి పరిషత్) పోరాటానికి సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే రేవంత్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. జూన్ 23న అంటే ఈ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మూసివేయాలని ఏబివిపి పిలుపునిచ్చింది. ఈ స్టూడెంట్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టనున్నారు... కాబట్టి స్కూళ్ళు నడిపించే ప్రయత్నం చేసినా బలవంతంగా మూయించే అవకాశాలుంటాయి.
మొహర్రం పండగను తెలుగు రాష్ట్రాల్లో హిందూముస్లింలు కలిసి ఘనంగా జరుపుకుంటారు... అందుకే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు రెండ్రోజులు సెలవు ప్రకటించాయి. మొహర్రం పండక్కి ముందురోజు అంటే జూన్ 25 గురువారం తెలుగు ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది.. అంటే ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ సెలవు పొందవచ్చు.. కానీ విద్యాసంస్థలు యధావిధిగా నడుస్తాయి.
ఇక జూన్ 26, శుక్రవారం మొహర్రం పండగ... కాబట్టి ఆరోజు పూర్తిస్థాయి హాలిడే ఉంటుంది. అంటే ఉద్యోగులకే కాదు విద్యార్థులకు సెలవే... స్కూళ్లు, ఆఫీసులు పూర్తిగా మూసివుంటాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ శుక్రవారమే మొహర్రం వేడుకలు జరుగుతాయి.
కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు... ఐటీ, కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసేవారికి వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా రెండ్రోజులు సెలవులు ఇస్తాయి. ఇలాంటి ఉద్యోగులు, విద్యార్థులకు జూన్ 27న శనివారం సెలవే. అయితే చాలా విద్యాసంస్థలు, ఆఫీసులు శనివారం పనిచేస్తాయి... ఈ సెలవు కొందరికే వర్తిస్తుంది.
బ్యాంకు ఉద్యోగులకు మాత్రం ఈ శనివారం కచ్చితంగా సెలవు ఉంటుంది. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది... ఈ జూన్ లో రాబోయేది నాలుగో శనివారం. కాబట్టి తెలంగాణ, ఏపీలోని బ్యాంక్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది.
జూన్ 28 ఆదివారమే కాబట్టి విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవు ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో కేవలం రెండ్రోజులే (జూన్ 22, 24) ఫుల్ వర్కింగ్ డేస్... ఐదు రోజులు (జూన్ 23, 25,26, 27,28) సెలవులే. ఈ సెలవుల సమాచారం విద్యార్థులే కాదు ఉద్యోగులు ఎగిరిగంతేసేదే.