
ఓటు చోరీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎస్ఐఆర్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు.
నారాయణపేటలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఐఆర్ అనేది కేవలం ఓటర్ల జాబితాలోని డూప్లికేట్, బోగస్, అర్హతలేని పేర్లను తొలగించే ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు కొనసాగాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కోరుకుంటున్నాయా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది మోదీ ప్రభుత్వం మాత్రమేనని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయన్నారు. ఈ వార్త చదివారా: సంధ్య థియేటర్ ఘటన.. కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్