
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Second-Hand Car: భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ భారత మార్కెట్లో అత్యధిక కార్లను విక్రయిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ కార్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.వెహికల్ పోర్టల్స్ నుంచి లభించిన డేటా ప్రకారం ఒక నిర్దిష్ట లేదా సంవత్సరంలో ఏ కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయో తెలుసుకుంది. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విషయం వేరు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా మారుతి ఆధిపత్యం చెలాయిస్తోంది. Cars24-Team BHP రిలీజ్ చేసిన డేటా ప్రకారం 2025లో సెకండ్ హ్యాండ్ కార్ల మారుతి సుజుకీ స్విఫ్ట్ 4.93 శాతం వాటాను కలిగి ఉందని అంచనా వేసింది. మెట్రో, నాన్ మెట్రో నగరాలు ఈ రెండింటిలోనూ స్విఫ్ట్ కు డిమాండ్ ఉంది. మెట్రో నగరాల్లో దీని మార్కెట్ వాట 5శాతం ఉండగా.. నాన్ మెట్రో నగరాల్లో 4.8శాతంగా ఉంది.
ఈ రెండు నగరాల్లో వాటా 4.93శాతంగా ఉంది. 2025లో సుమారు 5 మిలియన్ల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడుపోయినట్లు నివేదిక చెబుతోంది. అంటే ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 4.93 శాతం అనేది సుమారు 2.5లక్షల యూనిట్లకు సమానం. అంటే ఒక ఏడాదిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 2.5లక్షల మారుతీ సుజుకీ స్విఫ్ట్ లు అమ్ముడుపోయాయని అర్థం. ఈ గణాంకాలు ట్రాక్ చేసి మార్కెట్ నుంచి తీసుకున్నారు. స్థానిక డీలర్ల వద్ద స్విఫ్ట్ కు భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ గణాంకాలు కూడా తీసుకున్నట్లయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక కొత్త కార్ల విషయంలో కూడా స్విఫ్ట్ భారీ డిమాండ్ ఉందని చెప్పాలి.
2026 మే నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ 17,519 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం కంపెనీ 14,135 యూనిట్లను విక్రయించింది. ఇది కార్ల అమ్మకాలలో సంవత్సరానికి 24శాతం వృద్ధిని సూచిస్తుంది. భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు ప్రజాదరణ పెరుగుతున్న తరుణంలో.. మారుతి సుజుకి స్విఫ్ట్ విభాగంలో దీనితో పోటీపడగల మరో హ్యాచ్‌బ్యాక్ కారు లేదనే చెప్పాలి.
స్విఫ్ట్ అమ్మకాలను పరిశీలిస్తే.. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ ప్రతి నెలా సగటున 14,000 నుండి 18,000 యూనిట్లను అమ్ముతోంది. ఈ కారు ఇంత భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నందున, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో దీనికి బలమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా, స్విఫ్ట్‌పై మారుతికి ఉన్న నమ్మకం వల్ల, ప్రజలు కార్ సర్వీస్ లేదా విడిభాగాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.కొత్త స్విఫ్ట్ 2024లో విడుదల కానుంది. ఇందులో 82 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.2-లీటర్, మూడు-సిలిండర్ Z-సిరీస్ ఇంజన్‌ను అమర్చారు. కొత్త స్విఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే తేలికైనది. దీనిని పెట్రోల్, CNG ఇంజన్లు రెండింటితోనూ కొనుగోలు చేయవచ్చు. దీని భద్రతా ఫీచర్లు కూడా చాలా అప్ డేట్ తో వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.