
ప్రతిరోజూ ఒకే రకమైన వంట తిని ఇబ్బంది పడుతున్నారా! అయితే కొత్త వంటకాలు ఏం చేయాలి? ఎలా చేయాలనుకునే వారు వీటిని ప్రయత్నించండి..
Jun 21 2026 12:48 PM | Updated on Jun 21 2026 12:48 PM
ప్రతిరోజూ ఒకే రకమైన వంట తిని ఇబ్బంది పడుతున్నారా! అయితే కొత్త వంటకాలు ఏం చేయాలి? ఎలా చేయాలనుకునే వారు వీటిని ప్రయత్నించండి..
ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు వేయాలి.
నీళ్లు పోయకుండా, దీనిని బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో నెయ్యి వేసి; ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
పోపు వేగాక, అందులో అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత కడిగి ముక్కలుగా కోసుకున్న పుట్టగొడుగులను కడాయిలో వేసి, మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి.
మష్రూమ్స్ వేగాక అందులో క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే çకలుపుతూ వేయించాలి.
చివరగా, మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పెప్పర్ మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి.
మసాలా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన మష్రూమ్ పెప్పర్ ఫ్రై సిద్ధం.
స్నికెర్ డూడుల్ కుకీస్ కావలసినవి: మైదాపిండి: రెండు ముప్పావు కప్పులు వెన్న: కప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పులు గుడ్లు: 2, వెనీలా ఎసెన్స్: టీస్పూన్ క్రీమ్ ఆఫ్ టార్టార్: 2 టీస్పూన్లు బేకింగ్ సోడా: టీస్పూన్ ఉప్పు: పావు టీస్పూన్ పంచదార: పావు కప్పు దాల్చినచెక్క పొడి: ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.
ఒక గిన్నెలో మైదా పిండి, క్రీమ్ ఆఫ్ టార్టార్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
మరొక పెద్ద గిన్నెలో మెత్తటి వెన్న, చక్కెర వేసి బ్లెండర్ లేదా స్పూ¯Œ తో బాగా కలపాలి.
ఇది సాఫ్ట్‌గా, క్రీమ్‌లా మారే వరకు బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో రెండు గుడ్లు, వెనీలా ఎసె¯Œ ్స వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ వెన్న మిశ్రమంలో, ముందుగా సిద్ధం చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి.
ఆ తరువాత ఒక చిన్న ప్లేట్లో కోటింగ్ కోసం ఉంచిన పావు కప్పు చక్కెర, దాల్చినచెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
తయారు చేసుకున్న పిండిని చిన్నగా గుండ్రని బాల్స్‌లా చుట్టుకోవాలి.
ఈ బాల్స్‌ను దాల్చినచెక్క– చక్కెర మిశ్రమంలో వేసి, చుట్టూ ఆ పొడి బాగా అంటుకునేలా దొర్లించాలి.
ఇలా సిద్ధం చేసిన బాల్స్‌ను బేకింగ్ ట్రేపై సర్దాలి. వీటిని ప్రిహీట్ చేసిన ఓవె¯Œ లో 8 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేయాలి.
కుకీల అంచులు లైట్‌గా గోల్డెన్ కలర్లోకి రాగానే ఓవెన్ నుంచి తీసేయాలి. అంతే! ఎంతో సువాసనభరితమైన, నోట్లో వేస్తే కరిగిపోయే సాఫ్ట్ స్నికెర్ డూడుల్ కుకీస్ రెడీ!
కేరళ అరి పతిరి.. కావలసినవి: బియ్యప్పిండి: కప్పు నీళ్లు: ఒకటింపావు కప్పు కొబ్బరి నూనె: టీస్పూన్ ఉప్పు: అర టీస్పూన్ పొడి బియ్యప్పిండి: కొద్దిగా.
స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో బియ్యప్పిండి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి.
ఆ తరువాత ఒక పెద్ద కడాయిలో ఒకటింపావు కప్పుల నీళ్లు, టీస్పూన్ కొబ్బరి నూనె, అర టీస్పూన్ ఉప్పు వేయాలి.
నీరు బాగా మరిగాక ఇందులో వేయించి పెట్టుకున్న బియ్యప్పిండిని వేయాలి.
ఉండలు కట్టకుండా వెంటవెంటనే కలుపుతూ ఉండాలి. పిండి నీటిని పీల్చుకుని ముద్దలా అయ్యే వరకు కలపాలి.
ఇప్పుడు స్టవ్ ఆపేసి, గిన్నెపై మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
ఆ వేడి ఆవిరికే పిండి మరింత మెత్తగా ఉడుకుతుంది. పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులకు నూనె రాసుకుని పిండిని బాగా మెత్తగా, సాఫ్ట్‌గా అయ్యే వరకు చపాతీ పిండిలా ఒత్తాలి.
ఆ పిండి నుంచి చిన్న పిండి ముద్దలను చేసుకోవాలి. ఆ తరువాత చపాతీ పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లి, ఒక పిండి ముద్దను తీసుకుని వీలైనంత పల్చగా రొట్టెలా చేసుకోవాలి.
చివరగా స్టవ్ మీద నాన్–స్టిక్ పెనం పెట్టి, చేసి పెట్టుకున్న పతిరిని పెనంపై వేసి, రెండు వైపులా 30 సెకన్ల పాటు మాత్రమే కాల్చాలి. అంతే కేరళ అరి పతిరి రెడీ! వీటిని పంచదార కలిపిన ఫ్రెష్ కొబ్బరి పాలలో ముంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు)
వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ (ఫొటోలు)
సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?
నాన్న నేర్పిన పాఠాలే నా బలం.. ఫాదర్స్ డే సందర్భంగా YS జగన్ ట్వీట్..