
పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి వైఫల్యాలనైనా విజయాలుగా మార్చుకోవచ్చని నిరూపించాడు మీరట్‌కు చెందిన యువకుడు సంకేత్ కుమార్.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కేవలం రెండు మార్కుల తేడాతో విఫలమైనా కుంగిపోకుండా, అదే పట్టుదలతో చదివి ఇప్పుడు ఏకంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సైంటిస్ట్/ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, మోదీపురం వాసి అయిన సంకేత్ కుమార్, 2021లో దీవాన్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశాడు. అదే ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం రెండు మార్కులతో అర్హత సాధించలేకపోయాడు. చాలా మంది ఒక ఏడాది వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చినా, సంకేత్ మాత్రం తన కలను సాకారం చేసుకోవడానికే మొగ్గు చూపాడు. ఎలాంటి కోచింగ్ సెంటర్లో చేరకుండా కేవలం యూట్యూబ్ వీడియోలు, పాత ప్రశ్నపత్రాల సహాయంతో సొంతంగా చదువుకున్నాడు.ఆ తర్వాతి ఏడాదే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ రెండింటిలోనూ విజయం సాధించి, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు. అక్కడ కూడా తోటి విద్యార్థులంతా ప్రాపల్షన్, ఏరోడైనమిక్స్ వంటి ప్రాచుర్యం పొందిన సబ్జెక్టులను ఎంచుకుంటే, సంకేత్ మాత్రం వినూత్నంగా 'వైబ్రేషన్స్ అండ్ అకౌస్టిక్స్' అనే సబ్జెక్టును ఎంచుకున్నాడు. తన బ్యాచ్‌లో ఆ సబ్జెక్టును తీసుకున్న ఏకైక విద్యార్థి అతడే కావడం విశేషం. కోర్సు సమయంలో జపాన్‌కు చెందిన షిన్రా ఇంక్. సంస్థ నిర్వహించిన ఒక అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు కూడా ఎంపికై మూడు నెలల పాటు పనిచేశాడు.ఐఐఎస్‌టీలో