
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate: మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 95 నుంచి 94కు పెరిగింది. ఈ చర్యల్లో ఒకటి బంగారానికి సంబంధించింది. దిగుమతి బిల్లును తగ్గించుకునేందుకు ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీని ఫలితంగా బంగారం దిగుమతలు మూడింటి ఒక వంతు పడిపోయాయి. దీంతో ధరలు భారీగా దిగివచ్చాయి. అయితే పసిడి దిగుమతులు తగ్గడం వల్ల భారతదేశ వాణిజ్య లోటు కూడా తగ్గింది. ఇది దేశానికి మంచి పరిణామమని చెప్పాలి. గోల్డ్ పై దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత భారతదేశ నెలలవారీ బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. గతంలో దేశం ప్రతినెలా 75 నుంచి 100 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య నెలకు 25 నుంచి 30టన్నులకు చేరుకుంది.
ఏప్రిల్ 1,2026 నుంచి కస్టమ్స్ విభాగం బ్యాంకులను నియమతి బంగారు దిగుమతిదారులుగా గుర్తించలేదు. అంటే బ్యాంకులు ఇక నుంచి బంగారం దిగుమతి చేసుకునే అనుమతి లేదు. ఇప్పుడు ఎంఎంటీసీతో సహా కేవలం 3 ఏజెన్సీలకు మాత్రమే దేశంలో బంగారం దిగుమతి చేసుకునే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక దిగుమతి సుంకం విషయానికి వస్తే.. ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాన్ని 6శాతం నుంచి 15శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడం, రూపాయిని బలోపేతం చేయడం, వాణిజ్య లోటును నియంత్రించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన బంగారం దిగుమతులపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నెలలవారీ దిగుమతులు భారీగా పడిపోయాయి. దేశీయ లభ్యతపై దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంటే దేశీయంగా డిమాండ్ పెరిగినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలతో పోలిస్తే దేశీయంగా పెరిగే అవకాశంతోపాటు తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది.
ఇప్పటి వరకు భారతదేశం అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు పసిడిపై దిగుమతి సుంకాలు పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు తగ్గుతుంది. దిగుమతి సుంకం పెంపునకు బంగారం ధరల తగ్గుదలకు ఎలాంటి సంబంధం ఉండదు. చైనా తర్వాత ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశం భారతదేశం. దీనికి ప్రధాన డిమాండ్ ఆభరణాల పరిశ్రమ నుండే వస్తుంది. అయితే.. భారీ స్థాయిలో బంగారం దిగుమతులు జరగడం వల్ల దేశం నుండి గణనీయమైన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తోంది. అందుకే ప్రభుత్వం దీనిని నియంత్రించాలని కోరుకుంటోంది. అనవసరమైన బంగారు కొనుగోళ్ల విషయంలో పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం, దేశ మొత్తం దిగుమతులలో బంగారం వాటా 5 శాతానికి పైగా ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అనిశ్చితుల కారణంగా దిగుమతి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల.. ఆర్థిక కార్యకలాపాలను, ఆహార భద్రతను పెంపొందించేందుకు ముడి చమురు, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాలు, మూలధన వస్తువులు వంటి నిత్యావసర వస్తువుల దిగుమతులపై విదేశీ మారక ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెట్టడమే ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.