Gold Rate Today: ఇరాన్- అమెరికా యుద్ధం మళ్లీ మొదటికి వచ్చింది. కాల్పుల విరమణకు అమెరికా, ఇజ్రాయెల్ తూట్లు పొడించాయని, తమపై దాడికి దిగాయంటూ హార్ముజ్ జల సంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది.
దీంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. చమురు ధరలు మళ్లీ భారీగా పెరగడం, డాలర్ పుంజుకుంటే బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్థాయి. సాధారణంగా యుద్ధం పెరిగిదే బంగారం ధరలు సైతం పెరుగుతుంటాయి. కానీ, చమురు ధరలు, డాలర్ల కారణంగా ఇక్కడ పసిడి రేట్లు దిగివస్తున్నాయి. అయితే, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని, బంగారం ధరలు ఎటు వెళ్తాయో చెప్పలేమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత వారంలో భారీగా తగ్గిన బంగారం ధరలు క్రితం రోజు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో జూన్ 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి రేట్లు ఇవాళ స్థిరంగానే ఉన్నాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 70 డాలర్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే ధర వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4155 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 64.84 డాలర్లు వద్ద ట్రేడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్లో పసిడి రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజు సడెన్గా పెరిగిన ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,46,080 వద్ద ఉంది. అలాగ 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,33,900 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేటు బంగారంతో పాటు వెండి రేటు సైతం స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి రేటు రూ.2,55,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లో రూ.20 వేల మేర తగ్గిన సంగతి తెలిసిందే.లలితా జువెలరీల్లో గోల్డ్ రేటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో బంగారం ధరలు స్థిరంగానే ఉంటాయి. ఇవాళ ట్రేడింగ్ ఉండదు. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1 గ్రాముకు రూ. 13,390 వద్ద ఉంది. ఇక తులం రేటు చూస్తే రూ.1,33,900 పలుకుతోంది.