తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి . ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన అద్భుతమైన చిత్రాల్లో 1993లో విడుదలైన ‘ రాజేంద్రుడు...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి . ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన అద్భుతమైన చిత్రాల్లో 1993లో విడుదలైన ‘ రాజేంద్రుడు గజేంద్రుడు ’ ఒకటి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ , దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వినోదాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్పట్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఒక ఏనుగు చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఎమోషనల్గానూ కనెక్ట్ అయింది. అయితే ఈ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను, తాను ఎదుర్కొన్న సవాళ్లను గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి పంచుకున్నారు. చిరంజీవి సలహాతో మారిన నిర్ణయం‘రాజేంద్రుడు గజేంద్రుడు’ చిత్రానికి శ్రీకారం చుట్టడానికి ముందు ఎస్వీ కృష్ణారెడ్డి ఒక భారీ ద్విపాత్రాభినయ కథను సిద్ధం చేసుకున్నారు. అందులో ఒక హీరోగా తానే నటిస్తూ, మరో పాత్రకు ఒక ప్రముఖ తమిళ నటుడిని అనుకున్నారు. ‘మాతృదేవోభవ’ వంటి హృదయ విదారక చిత్రాన్ని అందించిన అజయ్ శాంతిని దర్శకుడిగా, ప్రముఖ రచయిత సత్యానంద్‌ను స్క్రిప్ట్ వర్క్ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కొన్ని పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఈ విషయం చెప్పగా.. ఆయన ఒక విలువైన సలహా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని చిరు చెప్పడంతో ఆ మాటను గౌరవించి ఎస్వీ కృష్ణారెడ్డి ఆ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు.* బీటెక్ బాబులూ గెట్ రెడీ.. జులై 4న థియేటర్లలోకి మళ్లీ వస్తోన్న ‘రఘువరన్ బీటెక్’! రాజేంద్రప్రసాద్ ప్లేస్‌లో నరేష్ ఎంట్రీఆ తర్వాత ఎలాగైనా ఒక మంచి కామెడీ సినిమా తీయాలనే కసితో ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ కథను సిద్ధం చేశారు. మొదట ఈ కథను రాజేంద్రప్రసాద్‌కు వినిపించగా, ఆయనకు లైన్ బాగా నచ్చింది. కానీ, కొత్త దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి ఈ భారీ సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేయగలరా లేదా అనే సందేహం ఆయనలో కలిగింది. ఇందుకోసం ప్రఖ్యాత ల్యాండ్డ్రాయింగ్ ఆర్టిస్ట్ జయదేవ్ చేత ప్రతి సీన్‌ను బొమ్మల రూపంలో గీయించి వివరించినప్పటికీ, రాజేంద్రప్రసాద్ మాత్రం వేరే దర్శకుడిని పెడితే బాగుంటుందేమో అని అభిప్రాయపడ్డారు. రాజేంద్రప్రసాద్ వెనకడుగు వేయడంతో ఈ కథను అప్పట్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న మరో హీరో నరేష్ దగ్గరకు తీసుకువెళ్లారు ఎస్వీ కృష్ణారెడ్డి. కథ విన్న నరేష్ వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, అడ్వాన్స్ ఇచ్చే సమయంలో నరేష్ ఒక విచిత్రమైన షరతు విధించారు. “ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. డబ్బింగ్ స్టేజ్‌కి వచ్చేసరికి నిర్మాతల దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అందుకే నా రెమ్యునరేషన్ మొత్తం డబ్బింగ్‌కు ముందే క్లియర్ చేయాలి” అని నరేష్ కోరారట.* సమంత సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ‘జూనియర్ సూర్యకాంతం’ కోపంతో ప్రాజెక్ట్ రద్దుహీరో నరేష్ మాట్లాడిన తీరు ఎస్వీ కృష్ణారెడ్డికి అస్సలు నచ్చలేదు. సినిమా ప్రారంభం కాకముందే నిర్మాతల ఆర్థిక పరిస్థితిని తక్కువ చేసి మాట్లాడటంపై ఆయన తీవ్రంగా కలత చెందారు. దాంతో నరేష్‌పై కోపంతో.. “డబ్బింగ్ సమయానికి డబ్బులు లేని పరిస్థితి వస్తుందని ముందుగానే అనుకుంటే, అసలు అలాంటి సినిమా చేయడమే వద్దు సార్” అని కరాఖండిగా మొహం మీదే చెప్పేశారు. తెచ్చిన అడ్వాన్స్ డబ్బులను వెనక్కి తీసేసుకుని, ఆ ప్రాజెక్ట్‌ను అక్కడికక్కడే రద్దు చేసుకుని ఆఫీస్ నుండి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించగా.. అంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘కొబ్బరి బొండం’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈసారి నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మొదలైన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’.. ఆ తర్వాత వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసిందో చరిత్ర చెప్పింది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, ఏనుగు మధ్య సాగే ఎమోషనల్ అండ్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.