
Tirupati District Pulse Polio: జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలి. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ నిర్వహణకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఈ నెల 28,29,30 వ తేదీలలో జరగబోవు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.
వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరం నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. బాలకృష్ణ నాయక్ తో కలిసి జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
Read Also : Gudivada Amarnath Allegations:హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్పై పోలీస్ స్టేషన్లో కేసు! ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పోలియో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, అవగాహన కార్యక్రమాలు, వ్యాక్సిన్ నిల్వలు, రవాణా ఏర్పాట్లు, పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. అర్బన్ ప్రాంతంలో మరియు పర్యాటక ప్రదేశాలలో పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోకుండా మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అలాంటి వారిపై దృష్టి సారించి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పోలియో బూత్‌లతో పాటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ద్వారా అర్హులైన చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
, పోలియో చుక్కల కార్యక్రమం 100 శాతం విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 1937 పల్స్ పోలియో కేంద్రాలు, 84 మొబైల్ కేంద్రాలు, 57 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లావ్యాప్తంగా 2,59,843 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైరిస్క్ ప్రదేశాలైన గుడారాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు వంటి చోట్ల మొబైల్ సిబ్బంది పర్యటించి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శాంతకుమారి, డి సి హెచ్ఎస్ ఆనందమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి కె వి ఎన్ కుమార్, ఐసిడిఎస్ పిడి వసంతబాయి ప్రోగ్రామ్ ఆఫీసర్లు, మున్సిపల్ ఆఫీసర్లు, డి ఆర్ డి ఏ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి పల్స్ పోలియో బ్యానర్‌ను మరియు పోస్టర్లను ఆవిష్కరించారు..
Teacher Misbehavior Jangaon: స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన: ‘ఆమె మాకొద్దంటూ’ రోడ్డెక్కిన విద్యార్థులు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Seshachalam crime: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు ఐదేళ్ల జైలు శిక్ష
Gudivada Amarnath Allegations:హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్పై పోలీస్ స్టేషన్లో కేసు!
Tirupati Gangamma Temple: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మకు ఐదవ మరు పొంగళ్ళు
Kalyandurgam News: కళ్యాణదుర్గం ప్రజా వేదికలో కూటమి విజయోత్సవం
Visakhapatnam Google Data Center: గూగుల్ డేటా సెంటర్‌పై తప్పుడు ప్రచారం సరికాదు.. ఎంపీ శ్రీభరత్
Gold merchant’s son impregnates maid : కోస్గిలో దారుణం: పనిమనిషిని గర్భవతిని చేసిన బంగారు వ్యాపారి కుమారుడు
జిల్లాలోని ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు అందించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని