
బెంగళూరును గ్లోబల్ మెగా సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఐర్లాండ్ గౌరవ కాన్సల్ కిరణ్ మజుందార్-షా నేతృత్వంలో పలువురు పారిశ్రామికవేత్తలు, కాన్సల్ల ప్రతినిధులు ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ప్రత్యేకంగా సమావేశమైంది.
నగర సమిష్టి అభివృద్ధికి తాము అందించే సహకారం, చేపట్టబోయే సంస్కరణలపై ఇందులో చర్చించారు.కర్ణాటకను దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు ఐటీ, బయోటెక్నాలజీ రంగాలలో మరిన్ని విదేశీ మార్కెట్ భాగస్వామ్యాలను ఆకర్షించే అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ ను మరింత సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వారికి హామీ ఇచ్చారు.అంతర్జాతీయ దౌత్య ప్రతినిధుల సహకారం, ప్రభుత్వ సుస్థిర కార్యాచరణ, పౌరుల సమష్టి భాగస్వామ్యంతో గ్లోబల్ సిటీగా బెంగళూరు సాధించే వృద్ధి మరింత వేగవంతం అవుతుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.
పట్టణ ప్రణాళికలను మరింత పటిష్టంగా, పారదర్శకంగా అమలు చేయడం ద్వారా బెంగళూరు బ్రాండ్ విశ్వవ్యాప్తమౌతుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మరింత పటిష్టమౌతుందని పేర్కొన్నారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం కిరణ్ మజుందార్ షా మీడియాతో మాట్లాడారు. బెంగళూరును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు అండగా ఉంటామని ప్రకటించారు.
బెంగళూరు నగరం మాత్రమే కాకుండా, సమగ్ర కర్ణాటక ప్రగతి కోసం ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉందని, ఈ దిశగా మున్ముందు మరిన్ని నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా వెలుగొందుతున్న బెంగళూరుకు అదే స్థాయిలో రోడ్లు, కనెక్టివిటీ అవసరమని కిరణ్ మజుందార్-షా అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రతిపాదిత భూగర్భ టన్నెల్ రోడ్ ప్రాజెక్టులు, ఎలివేటెడ్ హైవేలు, నూతన రవాణా కారిడార్ల నిర్మాణం వంటి బృహత్తర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇదే విషయాన్ని డీకే శివకుమార్ ప్రస్తావించారని అన్నారు.మౌలిక సదుపాయాల
బెంగళూరును గ్లోబల్ మెగా సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఐర్లాండ్ గౌరవ కాన్సల్ కిరణ్ మజుందార్-షా నేతృత్వంలో పలువురు పారిశ్రామికవేత్తలు, కాన్సల్‌ల ప్రతినిధులు ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. నగర సమిష్టి అభివృద్ధికి తాము అందించే సహకారం, చేపట్టబోయే సంస్కరణలపై ఇందులో చర్చించారు.కర్ణాటకను దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు ఐటీ, బయోటెక్నాలజీ రంగాలలో మరిన్ని విదేశీ మార్కెట్ భాగస్వామ్యాలను ఆకర్షించే అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ ను మరింత సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వారికి హామీ ఇచ్చారు.అంతర్జాతీయ దౌత్య ప్రతినిధుల సహకారం, ప్రభుత్వ సుస్థిర కార్యాచరణ, పౌరుల సమష్టి భాగస్వామ్యంతో గ్లోబల్ సిటీగా బెంగళూరు సాధించే వృద్ధి మరింత వేగవంతం అవుతుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రణాళికలను మరింత పటిష్టంగా, పారదర్శకంగా అమలు చేయడం ద్వారా బెంగళూరు బ్రాండ్ విశ్వవ్యాప్తమౌతుందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మరింత పటిష్టమౌతుందని పేర్కొన్నారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం కిరణ్ మజుందార్ షా మీడియాతో మాట్లాడారు. బెంగళూరును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు అండగా ఉంటామని ప్రకటించారు. బెంగళూరు నగరం మాత్రమే కాకుండా, సమగ్ర కర్ణాటక ప్రగతి కోసం ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉందని, ఈ దిశగా మున్ముందు మరిన్ని నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా వెలుగొందుతున్న బెంగళూరుకు అదే స్థాయిలో రోడ్లు, కనెక్టివిటీ అవసరమని కిరణ్ మజుందార్-షా అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రతిపాదిత భూగర్భ టన్నెల్ రోడ్ ప్రాజెక్టులు, ఎలివేటెడ్ హైవేలు, నూతన రవాణా కారిడార్ల నిర్మాణం వంటి బృహత్తర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇదే విషయాన్ని డీకే శివకుమార్ ప్రస్తావించారని అన్నారు.మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగర సుందరీకరణకు సమాన ప్రాముఖ్యతను ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తోందని, ఈ క్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని, వీటిని తాము స్వాగతిస్తున్నామని కిరణ్ షా తెలిపారు. నగర పాలక సంస్థలపైనే పూర్తి భారం వేయకుండా, నివాసితులుగా ప్రతి పౌరుడూ సామాజిక స్పృహతో వ్యవహరించాలని ఆమె సూచించారు.