
KGBV Job Recruitment | ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని కేజీబీవీల్లో 299 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ప్రిన్సిపాల్స్, సీఆర్టీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల 20వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
మరీ ముఖ్యంగా, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి టెట్ నిబంధన నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గత నెల 25న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సవరించిన నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు సమయానికి టెట్ అర్హత లేకపోయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు, తాము విధుల్లో చేరిన తేదీ నుంచి ఏడాది లోపు కచ్చితంగా ఏపీ టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నిర్ణీత గడువులోగా టెట్ అర్హత సాధించకపోతే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి సేవలను ఆటోమేటిక్గా నిలిపివేస్తామన్నారు. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నోటిఫికేషన్ ప్రకారం.. 16 ప్రిన్సిపల్ పోస్టులు, 98 పీజీటీ, 133 సీఆర్టీ, 52 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వేతనం, వయో పరిమితి, విద్యార్హతలు, తదితర వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
దరఖాస్తుల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల