
Nita ambani | ఇంటర్నెట్ డెస్క్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి ఆ చిన్నారికి సాధారణ జీవితం ప్రసాదించింది.
ప్రస్తుతం ఆ చిన్నారి అందరి పిల్లల్లానే స్కూలుకు వెళుతోందంటూ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ఓ తొమ్మిదేళ్ల బాలిక కథను పంచుకున్నారు. లావణ్య తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్న సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వచ్చారు.
గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్) ఒక్కటే ప్రాణాలు కాపాడే మార్గమని వైద్యులు చెప్పారు. లావణ్య తండ్రి ఆమెను వదిలేసి వెళ్లిపోవడంతో తల్లి ఒక్కరే ఆ భారాన్ని మోస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో లావణ్యకు సంక్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.
నెమ్మదిగా కోలుకున్న లావణ్య ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉంది. స్కూల్‌కు వెళ్తూ, స్నేహితులతో ఆడుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతోందని లావణ్య గురించి నీతా అంబానీ చెప్పుకొచ్చారు. దీంతో సభలో చప్పట్లు మార్మోగాయి. రోగులకు సేవ చేయడమే తమ ధర్మమని, ప్రతి ఆసుపత్రి ఒక దేవాలయం లాంటిదని నీతా అంబానీ అన్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందుబాటులోకి, సరసమైన ధరల్లో తీసుకురావడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు