
ఇంటర్నెట్ డెస్క్: నటుడు సూర్య (Suriya) 50వ చిత్రానికి ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారా? అనేది కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెల్సన్, రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు.
అయితే ‘సూర్య 50’ కోసం వీరిద్దరూ కలిసి పని చేయనున్నట్లు సమాచారం. ఈ మైలురాయి చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీయాలని ప్లాన్. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అవకాశం ఉందని, దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తారని టాక్.
నెల్సన్ కామెడీ స్టైల్‌కి, సూర్య ఎనర్జీ తోడైతే థియేటర్లలో నవ్వులే నవ్వులని ఫ్యాన్స్ అంచనా. నెల్సన్ ప్రస్తుతం ‘జైలర్ 2’, ‘KHxRK రీయూనియన్’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. దీంతో ‘సూర్య 50’ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా టైమ్ పడుతుంది.
అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నెల్సన్-సూర్య కాంబో కుదిరితే తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.