
సమంత చెబుతూ, `ఈరోజు చెన్నైకి వచ్చినప్పుడు నాలో ఒక పెద్ద సంతోషం. మన ముఖ్యమంత్రిని కలవబోతున్నానని అనుకున్నాను. విజయ్ సార్ కేవలం తెరపైనే హీరోగా ఉండాల్సిన వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపించేది. ఆయన ఎనర్జీ, ఆయన ఉనికి, ప్రజలు ఆయనపై చూపే ప్రేమ..
ఇవన్నీ చూస్తుంటే, ఆయన ఇంతకంటే పెద్ద విషయాల కోసం పుట్టారని అనిపించేది. ఒక కొత్త రంగంలోకి దిగడానికి ఆయన చూపిన ధైర్యమే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. బాగా తెలిసిన ఒక రంగాన్ని వదిలి, సవాళ్లు ఎక్కువగా ఉండే చోటికి రావడం సాధారణ విషయం కాదు.
అది సులభం కాదు, కానీ తన వల్ల ఒక మార్పు తీసుకురాగలననే నమ్మకంతో ఆయన ఈ పని చేశారు` అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. సమంత ఇంకా చెబుతూ, `మనందరికీ జీవితంలో ఒక దశలో, మనకోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఏదైనా చేయాలనే ప్రేరణ వస్తుంది.
కానీ, కొద్దిమంది మాత్రమే ఆ పిలుపుకు స్పందిస్తారు. విజయ్ సార్, తనను నమ్మిన వాళ్లనే ఆశ్చర్యపరుస్తారని నాకు అనిపిస్తోంది. ఆయన పదవిలో ఉన్నందువల్ల కాదు, ఆయన ఆ పదవిని చూసే విధానం కోసం చెబుతున్నాను. ఆయనకు మానసిక బలం , జ్ఞానం, ఈ మార్గంలో ప్రయాణించడానికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను.
ఇది చూసే ప్రతి యువతకు ఒక రిమైండర్. మీరు మొదలుపెట్టిన జర్నీ కంటే జీవితం చాలా పెద్దది` అని సమంత చెప్పింది. ఈ సందర్భంగా విజయ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది సమంత. ఆమె `మా ఇంటి బంగారం` మూవీతో ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ, మే 10న ఒక కొత్త రాజకీయ శకం మొదలైంది. ఆ రోజే, నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి. జోసెఫ్ విజయ్, రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది 'నిజమైన
, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకం' అని ఆయన తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన పేర్కొన్నారు.