.webp&w=3840&q=75)
విజయవాడలో సాయికృష్ణ తల్లిని పరామర్మించిన వైఎస్ జగన్... విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చిన జగన్, ఈ దారుణ ఘటనపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ వైఎస్ జగన్, పోలీసుల వేధింపుల వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు.
ఒక సాధారణ యువకుడిని మే నెలలోనే పోలీసులు తీసుకువెళ్లారని, అతని ఆచూకీ కోసం తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కనీస సమాచారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పైగా, "నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో" అంటూ పోలీసులు అమానవీయంగా సమాధానం చెప్పడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో కేవలం కింది స్థాయి సిబ్బంది పాత్రే కాకుండా, పోలీసు ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నాయనే అనుమానాలను వైఎస్ జగన్ వ్యక్తపరిచారు. విజయవాడ సీపీ, ఏసీపీలతో పాటు డీజీపీకి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
కృష్ణలంక ప్రాంతంలో పోలీసుల అరాచకాలు హద్దులు దాటాయని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలోనూ ఇలాంటి వేధింపుల ఉదంతాలు వెలుగుచూశాయని జగన్ గుర్తుచేశారు. సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే మరో యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఒకే అధికారి వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలన్నారు.
వర్గాల్లో, ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడిని లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ నేపథ్యంలో.. జూన్ 29 లోగా సాయికృష్ణను న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి ఉండటంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించినప్పటికీ, విపక్షాలు మాత్రం దీనిని సరిపెట్టుకోవడం లేదు. ఈ కేసులో నిజాలు పూర్తిగా నిగ్గుతేలాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతోనే విచారణ సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలు, ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపైనే అందరి దృష్టి నెలకొంది.
బాధిత తల్లి ఆవేదనను పూర్తిగా విన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ కేసులో వైఎస్సార్సీపీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార బలంతో తప్పులను కప్పిపుచ్చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై మరియు వెనకుండి నడిపించిన రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక యువకుడి ప్రాణం పోవడం మరియు పోలీస్ స్టేషన్ లోనే హత్య జరిగిందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని జగన్ విమర్శించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తాము పోరాటం ఆపేది లేదని, ఈ కేసును అన్ని వేదికలపై గట్టిగా వినిపిస్తామని జగన్ స్పష్టం చేశారు.
రైతుకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతి.. రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేత
.
పోలీసుల లాకప్ డెత్ లపై ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై అటు రాజకీయ