మీ పార్ట్నర్ను ఉదయం, సాయంత్రం పూట చిరునవ్వుతో ప్రేమగా పలకరించండి. దీంతో బంధం బలంగా మారుతుంది. భాగస్వామి చెప్పే వాటిని శ్రద్ధగా వినాలి. వారు చెప్పే విషయాలకు మధ్యలో అడ్డుచెప్పకండి. గౌరవంగా వినండి. దీంతో బంధం బలంగా మారుతుంది.
భాగస్వామి చేసే చిన్న సహాయానికి కూడా కృతజ్ఞత చెప్పడం వల్ల బంధం దృఢంగా మారుతుంది. ప్రేమ పెరుగుతుంది. బిజీగా ఉన్నప్పటికీ రోజులో కొంత సమయాన్ని పార్ట్నర్తో కలిసి గడపండి. దీంతో సంతోషంగా ఉండొచ్చు. ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.
భాగస్వామిలో నచ్చే లక్షణాలను, వారి ప్రయత్నాలను అభినందించండి. దీంతో మీ బంధం బలంగా మారుతుంది. మీ పార్ట్నర్కు నచ్చిన చిన్న బహుమతులు సర్ప్రైజ్గా ఇస్తే వారు సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. చిన్న చిన్న తప్పులను మనసులో పెట్టుకోకూడదు.
క్షమించడం అలవాటు చేసుకోవాలి. క్షమించడం వల్ల బంధం దృఢంగా మారుతుంది. రోజులో ఒకసారైనా ఇద్దరూ కలిసి భోజనం చేయడం వల్ల బంధం దృఢంగా మారుతుంది. ప్రేమ పెరుగుతుంది. మీ ప్రేమను మీ భాగస్వామితో చెప్పండి. మీ భావాలను మాటల ద్వారా, పనుల ద్వారా తెలిపితే ప్రేమ పెరుగుతుంది
.