కిర్రాక్ ఆర్పీ ఒకప్పటి ఈ కామెడీ పీస్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. అధికార తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించడానికి ప్రధాన అస్త్రం. ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోయాలన్నా.. ఎవర్నైనా పర్సనల్ ఎటాక్ చేయాలన్నా కిర్రాక్ ఆర్పీ తరువాతే ఎవరైనా అన్నంతగా రెచ్చిపోతుంటాడు.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్, అదిరింది షోలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతోనే పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ.. ఆ తరువాత అదే షోని నానా తిట్లు తిట్టి తనని ప్రోత్సహించిన వాళ్లపై కూడా అనేక ఆరోపణలు చేసి హాట్ టాపిక్ అయ్యారు.
అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు అండ్ కో బ్యాచ్.. అప్పట్లో అదిరింది షోకి జంప్ చేశారు. ఆ కో బ్యాచ్‌లో కీలక సభ్యుడే కిర్రాక్ ఆర్పీ. తాను వస్తూ వస్తూ.. కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను కూడా అదిరింది షోకి తీసుకొచ్చాడు కిర్రాక్ ఆర్పీ.
అతని టీంలోనే తన్మయ్ అనే జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా ఉందేది. అయితే కొన్నాళ్ల వరకూ ఆర్పీ టీంలో ఉన్న ట్రాన్స్ జెండర్ తన్మయ్.. ఆ తరువాత అటు జబర్దస్త్‌లోనూ ఇటు అదిరిందిలోనూ కనిపించకుండా పోయింది. ఆ టైమ్‌లో కిర్రాక్ ఆర్పీ తనని ఎంత మోసం చేశాడో చెప్పుకొస్తూ టాన్స్ జెండర్ తన్మయ్ కీలక ఆరోపణలు చేసింది.
‘నేను ఎవరిసాయం కోరలేదు.. కోరినా సాయం చేయలేదు. జబర్దస్త్‌లో నన్ను మోసం చేసిన వాళ్లే ఉన్నారు. కిర్రాక్ ఆర్పీని నేను లైఫ్‌లో మర్చిపోలేను. జబర్దస్త్ షోని వదిలేసి.. అప్పట్లో అదిరింది షోకి వచ్చింది కూడా అతని వల్లే. ఒకానొక టైమ్‌లో అతన్ని నేను సొంత అన్నలా ట్రీట్ చేశాను.
కానీ అతని మైండ్ సెట్ వేరు. తను చేసింది తప్పు అని అనడం లేదు. కానీ పర్సనల్‌గా అతను చేసిన పనుల వల్ల చాలా బాధపడ్డాను. చాలా
సందర్భాల్లో నేను అతని సపోర్ట్‌గా నిలబడ్డాను. కానీ తన వల్లే నేను ఆ షో నుంచి బయటకు వచ్చేశాను. ఓ మనిషిని నమ్మి.. టాప్ షోని వదిలి అతని కోసం వచ్చేసినప్పుడు.. ఇక్కడ నుంచి వెళ్లిపోతుంటే కనీసం నేను ఎలా ఉన్నాను? అన్నది కూడా పట్టించుకోలేదు. ఆర్థికంగా కూడా నేను కిర్రాక్ ఆర్పీకి సాయంగా ఉన్నాను. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రం సాయం చేయడానికి ముందు రాలేదు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానంటే అతని వల్లే. అక్కడ నుంచి వచ్చేసి.. అదిరింది షోలో కిర్రాక్ ఆర్పీ టీంలో చేశాను. అతని వల్ల పర్సనల్‌గా చాలా ఎఫెక్ట్ అయ్యాను. నమ్మకం అనేది ఎంత పాపిష్ఠిది అయిపోయిందంటే.. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే.. పాడు చేయాలన్నా డబ్బే. మనీ మేక్స్ మెనీథింగ్స్ అని అంటారు కానీ.. మనీ మేక్స్ ఎవ్రీథింగ్. డబ్బు మీదే అంతా నడుస్తుంది. మనకి సాయం చేశారే అన్న విశ్వాసం కూడా లేదు. నేను అతనికి ఎంత సాయం చేశానన్నది కిర్రాక్ ఆర్పీకి తెలుసు. చాలామంది జబర్దస్త్ ఆర్టిస్ట్‌లకు తెలుసు. పైకి మాత్రం మమ్మల్ని చూస్తే వీళ్లకేంట్రా అని అనుకుంటారు కానీ.. లోలోపల ఎంత బాధపడతామో ఎవరికీ తెలియదు. నేను చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాను. ఇండస్ట్రీలో అవకాశాల పరంగా.. పర్సనల్ కెరియర్.. లవ్‌లో.. ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందుల్ని చూశాను. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ ఆ బాధల్ని అనుభవిస్తూనే ఉన్నాను. నాకంటూ ఏదీ లేదు. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు, అమ్మమ్మ, నానమ్మ అందరికోసం కష్టపడతాను. హైదరాబాద్‌లో నేను మాత్రమే ఉంటాను. ఎప్పుడైనా రండి అంటే ఫ్యామిలీ వస్తారు తప్ప.. నాతో ఉండరు. పెళ్లి గిల్లి అలాంటిది ఏం లేదు. నా లైఫ్‌లో మళ్లీ తెలిసి తెలిసీ ఆ తప్పు చేయలేను. నేను స్కూల్‌కి వెళ్లే టైమ్‌లో ఓ ముస్లిం అబ్బాయిని లవ్ చేశాను. పేరు చెప్పను కానీ.. తను కూడా లవ్ చేసేవాడు. ఆ లవ్ చాలా డీప్‌లోకి వెళ్లిపోయింది. దాదాపు ఐదేళ్లు డీప్ లవ్‌లో ఉన్నాం. ఆ తరువాత అతను మొహం చాటేశాడు’ అంటూ చెప్పుకొచ్చింది జబర్దస్త్ తన్మయ్. అయితే ఈ ఇంటర్వ్యూ పాతదే అయితే.. ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ పొలిటికల్ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతుండటంతో.. ఈ పాత ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.