
No Test No Licence: డ్రైవింగ్ రాకపోయినా పరవాలేదు ఏజెంట్ లు చూసుకుంటారులే, ఎలాగోలా లైసెన్స్ వచ్చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా భావించే వారికి ఇకపై ఆ ఆటలు సాగవు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో పాతుకుపోయిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతకుముందు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక సోదాలలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Kolusu Parthasarathy: ఏపీలో వీరికి గుడ్ న్యూస్.. రూ.50వేల నుంచి రూ.లక్ష.. మంత్రి కీలక ప్రకటన.. రవాణా శాఖ కార్యాలయాలలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా, ప్రైవేట్ దళారుల ద్వారా అక్రమ మార్గాల్లో డ్రైవింగ్ లైసెన్సు(No Test No Licence)లు జారీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఏసీబీ తనిఖీలలో తేలిన వివరాల ప్రకారం.. అనేక ప్రాంతాలలో డ్రైవింగ్ పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించకుండా కేవలం మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు పరీక్షలతో పనే లేకుండా, అభ్యర్థులు కనీసం టెస్ట్ ట్రాక్ వద్దకు రాకపోయినా నేరుగా లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి.
ఉన్నతాధికారులు ఎవరైనా ఆకస్మిక తనిఖీలకు వస్తే స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఆర్టీవో కార్యాలయాల్లో కొన్ని ప్రత్యేక రహస్య కోడ్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ తీవ్రమైన ఉల్లంఘనలపై రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.
చంద్రశేఖర్ గౌడ్ స్పందిస్తూ లైసెన్సింగ్ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ప్రక్రియలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి డ్రైవింగ్ ట్రాక్ ఇన్ఛార్జ్లందరికీ కఠిన ఆదేశాలను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన తేదీన ఖచ్చితంగా డ్రైవింగ్ ట్రాక్ వద్ద వ్యక్తిగతంగా హాజరుకావాలి.పరీక్ష ప్రారంభించడానికి ముందే అభ్యర్థి గుర్తింపును ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
No test no licence Telangana transport department orders strict identity verification on driving tests
No Test No Licence: డ్రైవింగ్ రాకపోయినా పరవాలేదు ఏజెంట్ లు చూసుకుంటారులే, ఎలాగోలా లైసెన్స్ వచ్చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా భావించే వారికి ఇకపై ఆ ఆటలు సాగవు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో పాతుకుపోయిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతకుముందు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక సోదాలలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Kolusu Parthasarathy: ఏపీలో వీరికి గుడ్ న్యూస్.. రూ.50వేల నుంచి రూ.లక్ష.. మంత్రి కీలక ప్రకటన..
రవాణా శాఖ కార్యాలయాలలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా, ప్రైవేట్ దళారుల ద్వారా అక్రమ మార్గాల్లో డ్రైవింగ్ లైసెన్సు(No Test No Licence)లు జారీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ తనిఖీలలో తేలిన వివరాల ప్రకారం.. అనేక ప్రాంతాలలో డ్రైవింగ్ పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించకుండా కేవలం మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు పరీక్షలతో పనే లేకుండా, అభ్యర్థులు కనీసం టెస్ట్ ట్రాక్ వద్దకు రాకపోయినా నేరుగా లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఉన్నతాధికారులు ఎవరైనా ఆకస్మిక తనిఖీలకు వస్తే స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఆర్టీవో కార్యాలయాల్లో కొన్ని ప్రత్యేక రహస్య కోడ్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ తీవ్రమైన ఉల్లంఘనలపై రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.
చంద్రశేఖర్ గౌడ్ స్పందిస్తూ లైసెన్సింగ్ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ప్రక్రియలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి డ్రైవింగ్ ట్రాక్ ఇన్ఛార్జ్లందరికీ కఠిన ఆదేశాలను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన తేదీన ఖచ్చితంగా డ్రైవింగ్ ట్రాక్ వద్ద వ్యక్తిగతంగా హాజరుకావాలి.పరీక్ష ప్రారంభించడానికి ముందే అభ్యర్థి గుర్తింపును ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్దేశిత డ్రైవింగ్ పరీక్షను పూర్తి చేయాలి. వాహనాన్ని స్టార్ట్ చేయడం, ఆపడం, రివర్స్ తీయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను ఖచ్చితంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కేవలం వాహనం స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటే చాలు పాస్ మార్కులు వేసే పాత పద్ధతులను పూర్తిగా నిషేధించారు.
Petrol Diesel Prices: తెరుచుకున్న హార్ముజ్ జలసంధి.. భారీగా తగ్గుతున్న క్రూడ్ ఆయిల్.. భారత్ లో పెట్రోల్, వంటగ్యాస్ ధరల తగ్గుతాయా?
పరీక్షల సమయంలో డ్రైవింగ్ ట్రాక్‌లలో ఉన్న సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని విజిలెన్స్ విభాగం ఆదేశించింది. ఒకవేళ నిఘా వ్యవస్థను ఆపినా లేదా రికార్డింగ్‌లతో హ్యాకింగ్ చేయాలని చూసినా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రైవేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు ఎవరూ ఆర్టీవో కార్యాలయాల లోపలికి, టెస్ట్ ట్రాక్‌ల వద్దకు రాకుండా పూర్తిగా నిషేధించారు. నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా రవాణా శాఖలో దళారుల ముఠా నెట్‌వర్క్‌ను పూర్తిగా బద్దలు కొట్టి, అర్హులైన వారికి మాత్రమే లైసెన్సులు అందేలా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
అభ్యర్థులు నిర్దేశిత డ్రైవింగ్