
Cobras during monsoon season: నాగు పాములు వానాకాలంలో ఇంటి ఆవరణంలో లేదా ఇంటి చుట్టు ఉండే చెట్లలో ఎక్కువగా సంచరిస్తాయి. ముఖ్యంగా పంటపొలాలు, అడవులు దగ్గరగా ఉండే చోట్ల ఇవి కన్పిస్తాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే రైతులు ఎదుర్కొనేప్రధాన సమస్యలు పాముల కాట్లు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కోబ్రాలు కాటు వేస్తాయి. ఈ క్రమంలో కోబ్రాలు వర్షాకాలంలో వాటి నివాసం ప్రదేశాలు అయిన పుట్టలు వాన నీటితో నిండిపొవడంవల్ల వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతాయి.
ఇవి ఇంటిచుట్టు ఉండే పెద్ద పెద్ద ఆకులు ఉన్న చెట్లలో దాక్కుంటాయి. గుబురుగా ఉండే మొక్కలు, ఉపయోగించని పైపులు, పాత సామానులు,చీకటిగా ఉండే ప్రదేశాల్లో కోబ్రాలు ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా.. పాములు నీటి ట్యాంకుల దగ్గర నివసించే చిన్న కప్పలను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాయి.
వీటి నుంచి వెలువడే వాసనల్ని కోబ్రాలు గుర్తిస్తాయి. అందుకే పంప్ గదులను, నీటి పైపుల చుట్టూ ప్రదేశాలను శుభ్రంగా, మంచి వెలుతురు ఉండేలా ఉంచండి. బూట్లను నెల మీద పెట్టకూడదు. కారులు, బైక్ ల కవర్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకొవాలి.
మంచాల కింద నిల్వసామాన్లు పెట్టకూడదు. వీటి మధ్యలో కూడా దూరి పాములు దాక్కుంటాయి. వంట గదిలో ధాన్యం ఎలుకలను ఆకర్షిస్తుంది. ఎలుకలు ఎక్కడుంటే అక్కడ పాములు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే బియ్యం లేదా గోధుమల పెద్ద సంచులను ఉంచినట్లయితే వాటిని ఎలుకలకు అందకుండా ఎత్తుగా ఉండే బెంచీలు లేదా స్టూల్ ల మీద పెట్టాలి.
కోబ్రాలు తెరిచి ఉన్న పైపుల ద్వారా లేదా బాత్రూం నేలలోని రంధ్రాల ద్వారా ఇంట్లోకి ప్రవేశించగలవు. అందుకే ఇంటిచుట్టు ఉండే పైప్ డ్రెయిన్లన్నింటికీ మందపాటి మూతలు (జాలీలు) ఉండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూాడా రంధ్రాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి
.
ఇంటి చుట్టుపక్కల పొడవాటి గడ్డి, పెద్ద ఆకుల చెట్లు పాములకు తెరలాగా పనిచేస్తాయి. దీనిలో దూరి పాములువాటిని చుట్టుకుంటాయి. అందుకే వర్షాకాలంకు ముందే ఇంటి చుట్టు లేదా పెరట్లో గడ్డి పెరగకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. పొదలను ఎప్పటికప్పుడు క్లీన్ గా చేసుకొవాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే కోబ్రాల కాటు నుంచి సులువుగా బైటపడవచ్చు.