
Sreemukhi : యాంకర్ గా అనేక టీవీ షోలతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఇప్పుడు కూడా పలు టీవీ షోలతో దూసుకుపోతుంది. మధ్యమధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తుంది శ్రీముఖి. తనకు 33 ఏళ్ళు కావడంతో ఎక్కడకు వెళ్లినా పెళ్లి టాపిక్ వస్తుంది.
తాజాగా శ్రీముఖి సమంత మా ఇంటి బంగారం సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ రిలీజ్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో యాంకర్ శ్రీముఖి తన పెళ్లి గురించి మాట్లాడింది. Also See : Simran : సీఎం విజయ్‌తో సిమ్రాన్ ఫ్యామిలీ మీటింగ్..
సిమ్రాన్ కొడుకులు ఎంత పెద్దవాళ్ళు అయ్యారో చూశారా..? శ్రీముఖి మాట్లాడుతూ.. ఈ సినిమా జరిగేటప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఈ సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నా పెళ్లి జరుగుతుంది. అలా జరగాలని కోరుకుంటున్నాను. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్.
దొరగ్గానే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. దీంతో శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని తెలుస్తుంది
.