
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఇండియా టుడే టూరిజం అవార్డ్స్‌లో హైదరాబాద్‌కు ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డు లభించింది. హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
ప్రతిష్ఠాత్మక ఇండియా టుడే టూరిజం అవార్డ్స్‌లో హైదరాబాద్‌కు ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా ఆహార సంస్కృతి, ప్రత్యేక వంటకాలు, పర్యాటక ఆకర్షణల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. గోవాలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) చేతుల మీదుగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలు, వైవిధ్యభరితమైన ఆహార సంస్కృతికి ఈ అవార్డు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చిందని వివరించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ వంటకాల ప్రత్యేకత దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
ఈ అవార్డుతో ప్రపంచ ఆహార నగరాల జాబితాలో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరిగిందని తెలిపారు. తెలంగాణ పర్యాటక రంగం, ఆహార సంస్కృతి, ఆతిథ్య రంగాల అభివృద్ధికి ఇది గొప్ప గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలను ప్రోత్సహించేలా చర్యలు..
అలాగే ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రజలకు, హోటల్ పరిశ్రమకు, పర్యాటక, ఆతిథ్య రంగ భాగస్వాములకు అంకితం చేస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధితో పాటు తెలంగాణ సంప్రదాయ వంటకాలను ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు.
హైదరాబాద్ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆహార గమ్యస్థానంగా ఎదుగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
చిన్న తప్పులకూ ఉద్యోగ బహిష్కరణ సరికాదు: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And National News
ఈ జాతీయ అవార్డు ద్వారా హైదరాబాద్ కలినరీ టూరిజం రంగంలో అంతర్జాతీయ గుర్తింపు దిశగా మరో ముందడుగు వేసిందని వివరించారు. రుచుల వైవిధ్యం, చరిత్రక ఆహార సంప్రదాయాలు, ఆధునిక ఆతిథ్య రంగం కలయికతో