'పెద్ది' సినిమాతో బోసిపోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్లీ ఊపొచ్చింది. ఒరిజినల్ గా ఎంత కలెక్ట్ చేసింది?, అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా? వంటి చర్చలను పక్కనబెడితే.. ఈ సినిమా జనాలను థియేటర్లకు రప్పించిందనేది వాస్తవం.
ఎప్పటిలాగే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారనే నమ్మకంతో.. ఇప్పుడు వరుస చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ వారం దాదాపు అర డజను సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మా ఇంటి బంగారం’.
ఆమె భర్త రాజ్ నిడిమోరు క్రియేటర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. సామ్ యాక్షన్ అవతార్ లో అదరగొట్టారు.
ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం.‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ దర్శకుడు చిదంబరం..
ఇప్పుడు ‘బాలన్: ది బాయ్’ అనే సినిమాతో అలరించడానికి వస్తున్నారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 19న విడుదల కానుంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
అక్కినేని నాగ చైతన్య ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి, ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పోస్ట్ పెట్టారు. తెలుగు రిలీజులో అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పోటీగా 'బాలన్' థియేటర్లలోకి వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తర్వాత ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన హీరోగా రాశీ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జూన్ 19వ తేదీనే థియేటర్లలోకి రానుంది. దీంతో పాటుగా విజయ్ ఆంటోనీ నటించిన ‘వంద దేవుళ్ళు’ సినిమా కూడా విడుదలవుతోంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంవహించిన ఈ చిత్రంలో శ్వాసిక, అజయ్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ‘దీవాన’ అనే సినిమా థియేటర్లలోకి వస్తోంది. హర్షిత్, స్మేహ మణిమేఖలై జంటగా వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో తీసిన ఈ యూత్ ఫుల్ మూవీ.. జూన్ 19న సందడి చేయనుంది. మరోవైపు షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘కాక్టెయిల్ 2’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హిందీ వెర్షన్ ను ప్రదర్శించనున్నారు. ఇలా ఒకే రోజున అర డజను సినిమాలు రాబోతున్నాయి. మరి వీటిల్లో ఏయే చిత్రాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయో చూడాలి.
ఇదిలా ఉంటే, ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో అలరించిన సీనియర్ హీరో వడ్డే నవీన్.. సుదీర్ఘ విరామం