
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Isakapatnam Series streaming: ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేసిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రశాంత్ రఘతి రచించగా.. తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. ఈ సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌తో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, 15 భాషల సబ్ టైటిల్స్‌తో వరల్డ్ వైడ్‌గా 240కి దేశాల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగనుంది.
నేరాలు, రాజకీయాలు, ఫ్యాక్షన్, అధికార పోరాటాలు, క్రైమ్ డ్రామా నేపథ్యంలో ఒకదానితో ఒకటి ఢీకొనే ఈ కథలో ఆశ, దురాశ, ప్రతీకారం ప్రధాన అంశాలు నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్లగలరు విషయాన్ని ఈ సిరీస్ బలంగా చూపించనుంది.
యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, ఊహించని మలుపులతో నిండిన ఈ స్టోరీ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంత రేకిస్తుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ సందర్భంగా
దర్శకుడు గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ ... “ఇసాకపట్నం ఒక కల్పిత ప్రపంచంలో సాగే స్టోరీ అయినప్పటికీ, ఇందులో పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీగా ఉంటాయన్నారు. ఆశ, ప్రేమ, కోల్పోవడం, ప్రతీకారం వంటి అంశాలు ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠ లో ఉండే ఎన్నో ట్విస్టులు ఇందులో ఉన్నాయన్నారు. ప్రేక్షకులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుందన్నారు.
సముద్రఖని మాట్లాడుతూ ... ఇసకపట్నంలో బలమైన భావోద్వేగాలు, తన క్యారెక్టర్లో ఉన్న వైవిధ్యాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారనే విషయాన్ని ఈ స్టోరీ బలంగా చెబుతుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రగా ఉండిపోతుందన్నారు.
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ .. “పవర్, సంఘర్షణ తో నిండిన ప్రపంచంలో నా పాత్ర పవర్‌పుల్‌గా ఉండబోతుంది. ధైర్యం, బలహీనత, ఆత్మవిశ్వాసం కలగలిపిన పాత్ర. ఈ పాత్రను పోషించడం నాకు చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.
సునీల్ మాట్లాడుతూ ... “ఇసకపట్నం ప్రపంచం చాలా వాస్తవికంగా తెరకెక్కించారు. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. నేను ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుందన్నారు.
నరేష్ అగస్త్య మాట్లాడుతూ ...ప్రతి ఎపిసోడ్ కొత్తగా ఉండబోతుంది. పాత్రల భావోద్వేగాలు, వారి నిర్ణయాలు కథను మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ప్రేక్షకులు ఊహించని ఎన్నో మలుపులు ఎన్నో ఇందులో ఉంటాయి. సిరీస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారన్నారు.
మెరిన్ ఫిలిప్ మాట్లాడుతూ ...నిశ్శబ్దంగా కనిపించే ఒక లేడీ లైఫ్‌లో ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొని ఎలా బలంగా మారుతుందో ఈ పాత్రలో చూపించామన్నారు. ఆ ప్రయాణాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
అధికారం కోసం జరిగిన పోరాటాలు, కుటుంబ ద్రోహాలు, రాజకీయ ఎత్తుగడలు, ప్రతీకారాలతో నిండిన ‘ఇసకపట్నం’ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.