ఓవర్ థింకింగ్ తగ్గాలంటే ఈ రూల్ చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఆలోచనల నుంచి బయటపడేందుకు మూడు వస్తువులపై ఫోకస్ చేయండి. మూడు వేర్వేరు శబ్ధాలు వినండి. అలాగే మీ శరీరంలోని మూడు భాగాలను కదిలించండి. ఇలా చేస్తే ఆలోచనల నుంచి బయటపడతారు.
చాలామంది గడిచిపోయిన కాలం గురించి బాధపడుతుంటారు. ఏదో జరిగిపోయిందని తెగ ఆలోచిస్తుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి లాభం లేదని గుర్తుంచుకోండి. అందుకే గడిచిన కాలం గురించి కాకుండా జరగబోయే దాని గురించి ఆలోచించండి. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలంటే సుదీర్ఘ శ్వాస చాలా బాగా సహాయపడుతుంది.
దీనికోసం కూర్చున్న చోట కళ్లు మూసుకుని వీలైనంత సేపు సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి. కొద్దిసేపు హోల్డ్ చేసి తర్వాత వదిలేయండి. ఇలా చేయడం వల్ల మనసు కుదుటపడుతుంది. ఓవర్ థింకింగ్‌లో ఉన్నపుడు ఉన్నచోటే కూర్చుండిపోతారు. ఇలా కాకుండా ఆలోచనలు తగ్గకుండా ఉంటే వెంటనే అక్కడి నుంచి లేచి నడవండి.
ఇంట్లో అయితే వాటర్ తాగండి. ఆఫీస్ అయితే క్యాంటీన్ వెళ్లండి. యోగాసనాలు వేయడం ద్వారా శరీరం, మనసు రిలాక్స్ అవుతాయి. అలాగే ఓవర్ థింకింగ్ నుంచి కూడా బయటపడొచ్చు. ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని అస్సలు మార్చలేరు.
అందుకే జరిగిన తప్పు ఒప్పుకొని ఆ సమస్య నుంచి బయటపడండి. పాజిటివ్‌గా ఆలోచించండి. మొబైల్ వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా మీకు నచ్చదని కనిపిస్తే అక్కడే ఆగిపోతారు. అందుకే మొబైల్‌ను కాసేపు దూరం పెట్టండి. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడేందుకు మీకు నచ్చిన పని చేయండి.
బొమ్మలు వేయడం, డ్యాన్స్ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులు చేయండి. దీంతో ఆలోచనల నుంచి బయటపడతారు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ విషయాలు ఓ పేపర్‌పై రాయండి. దీనివల్ల మీకు ఓ క్లారిటీ వస్తుంది. మళ్లీ ఆ ఆలోచనలు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు
.