
ఇంటర్నెట్‌డెస్క్: సినిమాల్లోనే కాదు.. సెట్స్‌లోనూ ఎన్నో ప్రేమకథలు పుడుతుంటాయి. షూటింగ్ ముగిసిపోగానే, ఎండ్ కార్డు పడే లవ్‌స్టోరీలు కొన్నైతే, అడ్డంకులను దాటి వెడ్డింగ్ కార్డుల వరకూ వెళ్లేవి మరికొన్ని. అలాంటి ఓ అందమైన ప్రేమకథ 25 ఏళ్ల క్రితం ‘లగాన్’ సెట్లో పుట్టింది.
భారతీయ నటుడు అమీన్ హాజీ, బ్రిటన్ నటి చార్లొట్ విట్బీ కోల్స్ మధ్య చిగురించిన ఆ ప్రేమ.. పెళ్లి పీటలెక్కి పండంటి జీవితంగా మారింది. ఆమిర్ ఖాన్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘లగాన్’కు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం నాటి జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి ప్రత్యేక వేడుక నిర్వహించుకుంది.
ఆ ఉత్సవానికి అమీన్, హాజీ తమ ఇద్దరు కుమార్తెలతో పాటు హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓ రకంగా వారి ప్రేమకథకూ అది 25 వసంతాల వేడుకన్నమాట. దానికి సంబంధించిన ఫొటోలకు ఆన్లైన్లో నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ర్నూలు: నగరంలో నాగబంధం చిత్ర బృందం సందడి చేసింది
.