
Telangana Politics:ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2028 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇప్పటికే ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు పార్టీ పరిస్థితులు కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి, పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్‌నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Read also: Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ దాదాపుగా పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటలకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. మహబూబ్‌నగర్ బిడ్డనని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు.
తగిన గుణపాఠం చెప్తారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేదని, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంత గొప్పగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో గత ఎన్నికల్లో పార్టీ విఫలమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూనే, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలన్నారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు అందకుండా, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా వెనుకబడిన జిల్లాగా చేసిన ద్రోహాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో భారత రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేతలను ఆదేశించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి. లక్ష్మా రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.
CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడే కీలక విచారణ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana Weather Update: తెలంగాణకు వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Bhatti Vikramarka: సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ స్ఫూర్తికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
Telangana Private School Fee : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు భారీ డిమాండ్
KTR Palamoor BRS Meeting :పాలమూరులో క్లీన్ స్వీప్!
కేవలం మాటలు చెప్పి, ప్రకటనలకు పరిమితమైతే జిల్లా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయిందన్నారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు