
భారత్లో క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవార్టిస్ ఇండియా, అధునాతన ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం ‘ప్లువిక్టో’ (Pluvicto) అనే సరికొత్త ఔషధాన్ని దేశంలో ప్రారంభించింది. ఇది భారత్లో రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం పొందిన మొట్టమొదటి రేడియోలిగాండ్ థెరపీ (RLT) కావడం విశేషం.
పీఎస్ఎంఏ-పాజిటివ్ (PSMA-positive) ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ఈ చికిత్స ఒక కొత్త ఆశను అందిస్తోంది. ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా, కేవలం క్యాన్సర్ కణాలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని ఈ థెరపీ పనిచేస్తుంది.
ఇది వ్యాధి ముదరకుండా నిరోధించడంతో పాటు, రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.భారత్లో పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇది అత్యంత సాధారణమైన మూడు క్యాన్సర్లలో ఒకటిగా నిలిచింది.
దేశంలో ఏటా దాదాపు 2,50,000 కేసులు నమోదవుతుండగా, అందులో సగం కేసులు వ్యాధి చివరి దశకు (మెటాస్టాటిక్) చేరాక గానీ బయటపడటం లేదు. ఈ దశలో చికిత్స అందించడం సంక్లిష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లువిక్టో వంటి అధునాతన చికిత్సల అవసరం ఎంతగానో పెరిగింది.ఈ సందర్భంగా నోవార్టిస్ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్ హెడ్ జుడిత్ లవ్ మాట్లాడుతూ, "భారత్ మాకు అత్యంత ప్రాధాన్యమైన మార్కెట్.
ప్రెసిషన్ ఆంకాలజీ, అధునాతన క్యాన్సర్ సంరక్షణలో ఇక్కడ వేగం పుంజుకుంటోంది. ప్లువిక్టో వంటి అంతర్జాతీయ ఆవిష్కరణను ఇక్కడి రోగులకు అందుబాటులోకి తేవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. దేశంలో పెరుగుతున్న న్యూక్లియర్ మెడిసిన్ మౌలిక సదుపాయాల ద్వారా ఈ