
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో బద్రీనాథ్కు చేరుకున్న అంబానీకి బద్రీనాథ్ - కేదార్ నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ మేరకు ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి అంబానీ.. బద్రీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.కాగా ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ప్రత్యేక దర్శనం చేసుకుని శ్రీ బద్రీనారాయణ స్వామి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేశ ప్రజల శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి, శాంతి సౌభాగ్యాల కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు సమాచారం.
ఆలయ దర్శనం అనంతరం అంబానీ కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడిపి, అక్కడి పూజారులతో, ఆలయ కమిటీ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం పవిత్ర క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయానికి కూడా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయాభివృద్ధికి రూ.10 కోట్ల విరాళం..భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ముకేశ్ అంబానీ రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
ఈ విషయాన్ని బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రానా వెల్లడించారు. ఈ నిధులను యాత్రికుల కోసం వసతి, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
అంబానీ ప్రకటించిన ఈ విరాళం ఆలయ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని బీకేటీసీ అభిప్రాయపడింది.ముకేశ్ అంబానీ ప్రతి ఏడాది బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను సందర్శించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. వ్యాపార బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక యాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రముఖ దేవాలయాలను తరచూ దర్శించుకుంటుంటారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బద్రీనాథ్‌కు చేరుకున్న అంబానీకి బద్రీనాథ్ - కేదార్ నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి అంబానీ.. బద్రీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.కాగా ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ప్రత్యేక దర్శనం చేసుకుని శ్రీ బద్రీనారాయణ స్వామి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేశ ప్రజల శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి, శాంతి సౌభాగ్యాల కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు సమాచారం. ఆలయ దర్శనం అనంతరం అంబానీ కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడిపి, అక్కడి పూజారులతో, ఆలయ కమిటీ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం పవిత్ర క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయానికి కూడా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయాభివృద్ధికి రూ.10 కోట్ల విరాళం..భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ముకేశ్ అంబానీ రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రానా వెల్లడించారు. ఈ నిధులను యాత్రికుల కోసం వసతి, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అంబానీ ప్రకటించిన ఈ విరాళం ఆలయ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని బీకేటీసీ అభిప్రాయపడింది.ముకేశ్ అంబానీ ప్రతి ఏడాది బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. వ్యాపార బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక యాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రముఖ దేవాలయాలను తరచూ దర్శించుకుంటుంటారు. తిరుమల, సోమనాథ్, ద్వారకాధీశ్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు ఆయన తరచూ వెళ్లడం తెలిసిందే. ఆలయ దర్శనం మాత్రమే కాకుండా, ఆలయాభివృద్ధికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించడం ద్వారా ముకేశ్ అంబానీ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లో ఛార్‌ధామ్ యాత్ర భక్తుల రద్దీతో కొనసాగుతోంది. జూన్ 13 నాటికి 12.23 లక్షలకుపైగా భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోగా, 10.92 లక్షల మంది భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర క్షేత్రాలకు తరలివస్తుండటంతో అక్కడ భక్తిశ్రద్ధల వాతావరణం నెలకొంది.
తిరుమల, సోమనాథ్, ద్వారకాధీశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు ఆయన తరచూ వెళ్లడం తెలిసిందే. ఆలయ