
ఇంటర్నెట్ డెస్క్: భార్య కోసం ఓ భర్త 48 ఏళ్లు నిరీక్షించాడు. తీరా కళ్లెదుట ప్రత్యక్షమయ్యే సరికి ఆయన కళ్లలో ఆనంద భాష్పాలు నిండాయి. యుక్త వయసులో దూరమైన ఆ జంట వృద్ధాప్యంలో తిరిగి ఒక్కటయ్యారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పట్నా జిల్లాకు చెందిన లలన్ మిశ్రాకు నిర్మలాదేవితో 1977లో వివాహం జరిగింది.
కొంతకాలం సవ్యంగా సాగిన వారి కాపురంలో కుటుంబ కలహాలతో విభేదాలు తలెత్తాయి. భర్త మీద కోపంతో నిర్మలా పుట్టింటికి వెళ్లిపోయారు. అప్పటికే వారికి ఇద్దరు కుమారులు. అక్కడ కూడా తోబుట్టువులతో ఇబ్బందులు రావడంతో పిల్లలతో కలిసి ఆమె పుట్టింటినీ వీడారు.
నిర్మలకు ఆమె తండ్రి నాగ్‌పుర్‌లో ఉద్యోగం కల్పించారు. ఆమె కోసం భర్త వెతికినా ఆచూకీ దొరకలేదు. రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోయాయి. 48 ఏళ్ల తర్వాత ఆమె తన భర్తను కలవాలనుకుంది. పోలీసుల సాయంతో నేరుగా తన మెట్టినింటి గుమ్మం ముందు నిల్చుంది.
ఆమెను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. తీరా చేతిపై ఉన్నా టాటూ చూపించడంతో భర్త తొలుత ఆశ్చర్యపోయారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత తన భార్య తన ముందు కనిపించడంతో అంతులేని సంతోషం కన్నీరు రూపంలో బయటపడింది. ఒక్కసారిగా ఆమెను హత్తుకున్నారు. యుక్త వయసులో విడిపోయిన ఆ జంట వృద్ధాప్యంలో ఒకటవ్వడంతో ఆ ఇంట ఆహ్లాదకర వాతావరణం చోటుచేసుకుంది.
-ఈటీవీ భారత్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.