
ప్రజలు కేవలం ఓటే కాదు.. చరిత్ర రాస్తారని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం
కలిగించిందన్నారు. ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో 21 సీట్లతో సరిపెట్టుకున్న సందర్భంలో చాలామంది విమర్శించారు. కానీ, ప్రజల ఆశీర్వాదంతో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నాం’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ వార్త చదివారా: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది: సీఎం చంద్రబాబు