
2 Years Success Meet in Tirupati : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో ‘రెండేళ్ల
నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట భారీ బహిరంగ సభ (Success Meet) నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా కూటమి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కూటమి ప్రభుత్వ ప్రగతిని వివరించారు. నా రాజకీయ ప్రయాణం తిరుపతితోనే ముడిపడి ఉంది.
Read Also: AP Politics: తిరుపతి కూటమి సభలో అన్నీ అబద్ధాలే: షర్మిల!
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నాలుగోసారి సీఎంగా రెండేళ్లు: “నా రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైంది. సరిగ్గా ఇదే రోజున (జూన్ 12) నేను నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాను. నేటికి కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని గెలిపించిన కూటమి: 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాపాడుకుందాం, గెలిపిద్దాం అనే ఏకైక లక్ష్యంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్, నేను కలిశాం. ప్రజలు మాపై నమ్మకంతో భారీ మెజారిటీతో ఆశీర్వదించారు” అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు చూశాం. చివరకు ప్రజలకు సేవలందించే ఎమ్మార్వో ఆఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తాకట్టు పెట్టారు. అలా అన్నీ తాకట్టు పెట్టే రకానికి చెందిన వాళ్లకు ఇప్పుడు రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదు” అని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తేనే సంక్షేమం సాధ్యమవుతుందని, ఆదాయాన్ని పెంచే వాళ్లకు మాత్రమే సంక్షేమాన్ని ప్రజలకు పంచే హక్కు, అధికారం ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్రే శ్వాసగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను నడుపుతున్నామని చెప్పారు. 2019లో అధికారంలోకి రాగానే ‘ప్రజావేదిక’ భవనాన్ని కూల్చివేయడంతోనే గత ప్రభుత్వ విధ్వంస పాలన మొదలైంది. ఆ తప్పుడు విధానాల వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి.
Yoon Suk Yeol: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Tirupati trains: తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు!
AP Politics: తిరుపతి కూటమి సభలో అన్నీ అబద్ధాలే: షర్మిల!
Chandrababu Naidu Condolences: అమెరికా దాడిలో మెరైన్ ఇంజినీర్ సురేష్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
Pawan Kalyan: రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడింది: పవన్
Kurnool crime: క్షణికావేశంలో ముగ్గురు ఆత్మహత్య
Schools Reopen : తెరుచుకున్న పాఠశాలలు..పాఠ్యపుస్తకాల పంపిణీ