
మైక్రోవేవ్‌ను ఇలా క్లీన్ చేస్తే క్షణాల్లో కొత్తదానిలా మారిపోతుంది మైక్రోవేవ్‌ను ఇలా క్లీన్ చేస్తే క్షణాల్లో కొత్తదానిలా మారిపోతుంది Anand T 12 June 2026 ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ కారణంగా చాలా
మందికి వంట చేసుకోవడానికి టైం ఉండట్లేదు. అందుకే చాలా మంది వండిన ఆహారాన్ని ఇన్స్టెంట్గా వేడి చేసుకొని తినడం అలవాటు చేసుకుంటున్నారు. మైక్రోవేవ్ క్లీనింగ్ ఇలా ఆహారాన్ని వేడి చేసుకునేందుకు అందరూ మైక్రోవేవ్ ఓవెన్స్‌ను వాడుతున్నారు. ఎక్కవగా వాడడం ఇవి కొన్ని సార్లు మురికిగా మారిపోతాయి. అయితే వీటిని ఎలా క్లీన్ చేయాలో చాలా మందికి తెలియదు. కాబట్టి దీన్ని సింపుల్‌గా ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. మైక్రోవేవ్ క్లీనింగ్ ఒక మైక్రోవేవ్-సేఫ్ బౌల్లో నీళ్లు తీసుకుని, అందులో నిమ్మకాయ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ నిమ్మరసం ఆవిరి వల్ల మైక్రోవేవ్‌లో పేరుకుపోయిన జిడ్డు, ఎండిపోయిన ఆహార కణాలు సులభంగా లూజ్ అవుతాయి. ఇప్పుడు దాన్ని క్లాత్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. నిమ్మరసం స్టీమ్ క్లీనింగ్
ఇలా నిమ్మకాయను ఉపయోగించి క్లీన్ చేయడం వల్ల మైక్రోవేవ్ కొత్తదానిలా మెరవడమే కాకుండా మంచి సిట్రస్ సువాసన కూడా వస్తుంది.
తాజా సువాసన ఒక గిన్నెలో సమాన భాగాలుగా తెల్ల వెనిగర్, నీటిని మిక్స్ చేసి, ఆవిరి వచ్చే వరకు మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. ఇది మొండి మరకలను తొలగించి, దుర్వాసనను పోగొడుతుంది.
వెనిగర్ సొల్యూషన్ లోపల ఉండే గ్లాస్ టర్న్‌టేబుల్ ను విడిగా బయటకు తీసి, గోరువెచ్చని సబ్బు నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా అది కొత్త దానిలా మారుతుంది
టర్న్‌టేబుల్ క్లీనింగ్ స్టీమింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, మైక్రోవేవ్ లోపలి గోడలు, పైభాగం, తలుపును మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ లేదా స్పాంజ్ సహాయంతో శుభ్రంగా తుడవాలి. లోపలి గోడలను తుడవడం
మైక్రోవేవ్ తలుపు అంచులు, సీల్స్ దగ్గర ఆహార కణాలు పేరుకుపోతుంటాయి. కాబట్టి వాటిని తడి బట్టతో జాగ్రత్తగా తుడవాలి.డోర్ సీల్స్ క్లీన్‌గా ఉంచడం వల్ల మైక్రోవేవ్‌లో పరిశుభ్రత పెరగడమే కాకుండా, డోర్ సరిగ్గా లాక్ అవ్వడానికి సహాయపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్