
Yoon Suk Yeol: దక్షిణ కొరియా రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు న్యాయస్థానంలో మరోసారి భారీ షాక్ తగిలింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ పరిధిలోకి సైనిక
డ్రోన్లను పంపిన వ్యవహారంలో సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆయనకు 30 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దేశంలో తాను విధించాలనుకున్న సైనిక పాలన (మార్షల్ లా)కు అనుకూలమైన పరిస్థితులను, ఒక బలమైన సాకును సృష్టించేందుకే యూన్ ఈ డ్రోన్ల దాడికి వ్యూహాత్మకంగా ఆదేశించారని న్యాయస్థానం నిర్ధారించింది.
గతంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో మాజీ అధ్యక్షుడు యూన్ పాత్ర స్పష్టంగా ఉందని కోర్టు పేర్కొంది. అధికార దుర్వినియోగం, శత్రు దేశానికి పరోక్షంగా సహకరించడం (దేశ భద్రతను ప్రమాదంలో పడేయడం) వంటి తీవ్రమైన నేరాల కింద ఆయనను దోషిగా తేల్చింది. ఈ కుట్రలో యూన్‌తో భాగస్వామిగా ఉన్న నాటి రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్‌కు సైతం కోర్టు 30 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అలాగే ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఇతర ఉన్నత స్థాయి సైనికాధికారులకు సైతం ధర్మాసనం విభిన్న కాలపరిమితులతో కూడిన జైలు శిక్షలను ఖరారు చేసింది.
read also: Iran Supreme Leader: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మళ్ళీ వాయిదా
యూన్ సుక్ యోల్ ఇప్పటికే దేశంలో తిరుగుబాటుకు యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో ఆయన అకస్మాత్తుగా విధించిన మార్షల్ లా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకత కారణంగా గంటల వ్యవధిలోనే రద్దయింది. ఈ తీవ్ర పరిణామాల అనంతరం ఆయనపై అభిశంసన (Impeachment) వేటు పడటంతో పదవిని కోల్పోయి జైలు పాలుకావాల్సి వచ్చింది. ఆ కేసులో కోర్టు ఆయనకు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
రాజకీయ ప్రత్యర్థులను దేశద్రోహులుగా చిత్రకరించి, దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు తీసుకురావడానికే ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా 10కి పైగా డ్రోన్లను పంపారని ప్రాసిక్యూటర్లు కోర్టులో గట్టిగా వాదించారు. అయితే యూన్ తరఫు న్యాయవాదులు ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. ఉత్తర కొరియా అంతకుముందు ప్రయోగించిన చెత్త బెలూన్ల కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా, ఆత్మరక్షణ కోసమే డ్రోన్లను పంపామని.. ఈ తీర్పుపై తాము పైకోర్టులో అప్పీల్ చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ నిబంధనలు, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఈ కేసు విచారణ చాలా వరకు రహస్యంగా సాగడం గమనార్హం.
Tirupati trains: తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Iran Supreme Leader: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మళ్ళీ వాయిదా
Weather update: 176 ఏళ్లలో ఎన్నడూ లేని ఎండలు.. రికార్డ్ సృష్టించిన మే నెల
Oman Coast Ship Attack: భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాపై భారత్ తీవ్ర ఆగ్రహం
China ban on Indian chillies: చైనాలో భారత్ ఎండు మిర్చి నిషేధం
US Visa: అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
Elon Musk: ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్