
గ్రేటర్ చికాగో పరిసర ప్రాంతాల్లోని ప్రవాస తెలుగు సమాజాన్ని ఏకం చేస్తూ ప్రతిష్టాత్మక 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో' (TAGC) ఆధ్వర్యంలో వార్షిక 'వన భోజనాలు' (Picnic In The Park) కార్యక్రమాన్ని
ప్రకటించారు. ఈ ఏడాది అంతర్జాతీయ ఫాదర్స్ డే (Father's Day) సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రవాస తెలుగు కుటుంబాలంతా కలిసి ఆనందంగా గడిపేలా ఈ ప్రత్యేక పిక్నిక్‌ను ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచార పోస్టర్‌ను నిర్వాహక బృందం విడుదల చేసింది. ఈ వన భోజనాల ఉత్సవాన్ని పచ్చని ప్రకృతి మధ్య పర్ఫెక్ట్ పిక్నిక్ వైబ్స్‌తో అలరించేలా వినూత్న ఈవెంట్లను జోడించారు. ఇందులో భాగంగా పిల్లలు, పెద్దల కోసం సరదా ఆటల పోటీలు, రుచికరమైన దేశీయ వంటకాలతో కూడిన ప్రత్యేక వంటల పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పిక్నిక్లో టీఏజీసీ సభ్యత్వం కలిగిన కుటుంబాలకు ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, సభ్యత్వం లేని వారికి ఎంట్రీ ఫీజుగా 10 డాలర్లుగా నిర్ణయించారు. వన భోజనాల ముఖ్యాంశాలు... తేదీ, సమయం: జూన్ 21, 2026 (ఆదివారం) మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ పిక్నిక్ సాగుతుంది. వేదిక: Busse Woods, పిక్నిక్ గ్రోవ్ #32, బైస్నర్ రోడ్, ఎల్క్ గ్రోవ్ విలేజ్, ఇల్లినాయిస్ (IL 60007). రిజిస్ట్రేషన్ విధానం: పిక్నిక్లో పాల్గొనాలనుకునేవారు పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమ పూర్తి బాధ్యతలను సమన్వయాన్ని పిక్నిక్ చైర్ ప్రణీత్ మారెపల్లి (408-505-0622), టీఏజీసీ ప్రెసిడెంట్ అర్చనా పొద్దుటూరి (630-849-9135) పర్యవేక్షిస్తున్నారు. చికాగో పరిసరాల్లోని తెలుగు ప్రవాసులంతా ఈ ఫాదర్స్ డే వన భోజనాల్లో పాల్గొని విజయవంతం చేయాలని, మరింత సమాచారం కోసం tagc.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని టాగ్సి లీడర్షిప్ కోరింది.