
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కవలలకు పేరెంట్స్ అయ్యారు. ఇప్పుడు
ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తోంది నయనతార. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తోంది. తాజాగా తన నాల్గో వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంది నయనతార. జూన్ 9న వీరి పెళ్లి రోజు అనే విషయం తెలిసిందే.
తమ పెళ్లి రోజు సందర్భంగా నయనతార కొన్ని స్పెషల్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఈ అందమైన ఫోటోలను ఇంతకుముందెప్పుడూ చూడలేదు. నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి 2022 జూన్ 9న మహాబలిపురంలో చాలా గ్రాండ్గా జరిగింది. అప్పట్లో వాళ్ల పెళ్లి సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఈ జంట ఇప్పుడు తమ నాలుగో పెళ్లి రోజును జరుపుకుంటోంది. తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నయనతార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో "హ్యాపీ యానివర్సరీ టు అస్" అని పోస్ట్ చేసింది. ఈ అందమైన క్షణాలకు సంబంధించి తన భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలలో నయనతార తన భర్త విఘ్నేష్ శివన్కు ప్రేమగా ముద్దు పెడుతున్న సీన్ ఉంది. అలాగే పిల్లలతో సంతోషంగా తిరుగుతున్న క్షణాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ మొదటిసారి 2015లో 'నానుమ్ రౌడీదాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') సినిమా షూటింగ్లో కలుసుకున్నారు. ఆ స్నేహం ప్రేమగా మారి, చాలా ఏళ్ల ప్రేమ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు.
ఈ జంటకు సరోగసి ద్వారా ఉయిర్, ఉలగ్ అనే ఇద్దరు కవల అబ్బాయిలు పుట్టారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. నయనతార ఈ ఫోటోలను షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
త్రిష, సమంత, కాజల్ అగర్వాల్ వంటి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈ క్యూట్ ఫ్యామిలీకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నయనతార ప్రస్తుతం `టాక్సిక్` చిత్రంలో నటించింది. ఇది త్వరలో విడుదల కాబోతుంది. దీంతోపాటు తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.