
Papaya Farming: ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఆహారాల పైన ప్రజల్లో అవగాహన భారీగా పెరిగిపోయింది. అందుకే ఈ రంగంలో వ్యాపారం చేసే వారికి చక్కటి లాభాలు వస్తున్నాయి. మీరు కూడా ఆర్గానిక్ రంగంలో వ్యాపారం చేయాలి
అనుకున్నట్లయితే, వ్యవసాయంతో పాటు ఈ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. పళ్ళల్లో బొప్పాయి పండుకు మంచి డిమాండ్ ఉంటుంది.
ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అయినప్పటికీ వంటి బొప్పాయి పండును ఈ మధ్యకాలంలో ఎక్కువగా హైబ్రిడ్ పద్ధతుల్లో పురుగుల మందులు వేసి పెంచుతున్నారు. అయితే ఈ పద్ధతుల్లో కాకుండా సాంప్రదాయ వ్యవసాయంతో సహజ సిద్ధమైన ఎరువులతో ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ఈ పండ్లను ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా అమ్మినట్లయితే పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలో రికార్డు స్థాయి లాభాలు ఆర్జించడానికి ఆర్గానిక్ బొప్పాయి సాగు ఒక అద్భుతమైన మార్గంగా చెప్పవచ్చు. స్మార్ట్ ప్లానింగ్, సరైన రకాలను ఎంచుకోవడం, పూర్తిగా ఆర్గానిక్ పద్ధతులను పాటించడం ద్వారా బొప్పాయి సాగులో రైతులు ఏడాది పొడవునా ఊహించని లాభాలను సొంతం చేసుకోవచ్చు.
రసాయన ఎరువులకు బదులుగా ఆవు పేడ, వర్మీ కంపోస్ట్ వంటి పక్కా సేంద్రియ పద్ధతులను ఉపయోగించడం బొప్పాయిలో భారీ దిగుబడి సాధించడానికి ప్రధాన రహస్యం. ముఖ్యంగా 5 ఎకరాల విస్తీర్ణంలో బొప్పాయి తోటలు వేసేటప్పుడు, ముందుగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి.
సేంద్రియ ఎరువుల వాడకంతో మొక్కల వేర్లు వేగంగా, బలంగా అభివృద్ధి చెందుతాయి. రసాయనాలు వాడకపోవడం వల్ల పండ్లు ఆకర్షణీయంగా, పెద్దవిగా, నిగనిగలాడుతూ అత్యంత నాణ్యతతో తయారవుతాయి. ఈ పద్ధతి వల్ల సాగులో పెట్టే పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గుతుంది.మొక్కలలో రోగనిరోధక శక్తి పెరిగి, వైరస్లు, చీడపీడల బెడద దాదాపుగా ఉండదు.
సహజ సిద్ధంగా, రసాయనాల్లేకుండా పండించిన బొప్పాయికి ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. పండ్లు పండిన తర్వాత నేరుగా హోల్‌సేల్ మార్కెట్లు, నగరాల్లోని పెద్ద మార్కెట్లకు తరలిస్తే, వ్యాపారులు సైతం పోటీ పడి మరీ అధిక ధరలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.
ఒకసారి తోటలో పండ్ల కోత ప్రారంభమయ్యాక, 5 ఎకరాల బొప్పాయి తోట ద్వారా ప్రతి సీజన్‌కు అన్ని ఖర్చులు పోయాక సులభంగా 3 లక్ష రూపాయల ఆదాయం రైతుల చేతికి అందుతుంది. తక్కువ శ్రమతో, స్వల్పకాలంలో ఇంతటి భారీ రాబడినిచ్చే ఈ పంటను వేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు. ఆర్గానిక్ పళ్ళను విక్రయించాలి అనుకున్నప్పుడు మీరు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపార సంస్థలను సంప్రదిస్తే మంచిది
అలాగే మీరు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్లను పొంది విక్రయించినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆర్గానిక్ బొప్పాయి పండు తో పాటు ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచిన అరటి, నేరేడు, జామకాయ వంటి ఉద్యానవన పంటలకు కూడా మార్కెట్లో ఇదే తరహాలో డిమాండ్ ఉంది.