
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కోడి కూర విషయంలో తలెత్తిన వివాదంలో కన్న కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జంగిటి
రమేశ్ వృత్తిరీత్యా కూలీ పనులు చేసుకుంటుంటాడు. మంగళవారం (జూన్ 10) రాత్రి రమేశ్ ఒక నాటుకోడిని ఇంటికి తీసుకువచ్చాడు. దానిని కోసి కూర వండాలని భార్య అనూషను కోరాడు.
అయితే భార్య ఇప్పటికే వంట పూర్తయ్యిందనీ, చేపల కూర వండాననీ చెప్పింది. ఇక ఇప్పుడు కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న వారి కుమారుడు గణేశ్.. తండ్రిని అడ్డుకున్నాడు. దీంతో తండ్రి రమేష్ గణేశ్‌పై కూడా తిరగబడ్డాడు. దీంతో కోపం పట్టలేకపోయిన కుమారుడు గణేష్ అక్కడ ఉన్న రోకలిబండను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో రమేష్ కుప్పకూలిపోయాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు, అక్కడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. అయితే హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్ మరణించాడు. సమాచారం అందుకున్న తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన కొడుకు గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కే
హర్మూజ్ జల సంధి వద్ద అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి
ఏపీ లిక్కర్ కుంభకోణం.. మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు అరెస్టు?
.