
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర గతేడాదిన్నరగా గ్రాఫిక్స్ సమస్యలతో సతమతమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో, ఈ భారీ చిత్రం విడుదల
తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం స్వయంభుకు కూడా వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఏప్రిల్ నుండి వాయిదా పడిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. నాగబంధం చిత్రం కూడా గ్రాఫిక్స్ నాణ్యత కోసం మేకర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 3కి వాయిదా పడింది. పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్ ప్రాణం. అయితే, షూటింగ్ మధ్యలో మేకర్స్, వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ముందు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రంగంలోకి దిగితే ఈ జాప్యాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు