
ఖమ్మంలో కీచకుడి దాడిలో తీవ్ర గాయాలపాలై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. భవనం పైనుంచి తోసేయడం వల్ల బాలిక వెన్నముక దెబ్బతినడంతో పాటు చాలా చోట్ల ఎముకలకు
పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఎంత ఖర్చయినా ఆమెకు ప్రభుత్వం తరఫున అత్యుత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కోలుకోవడానికి మూడు నెలల వరకు సమయం పట్టొచ్చన్నారు. ఈ వార్త చదివారా: దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి: బండి సంజయ్