
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ, తన కెరీర్‌ను అక్కడే కాకుండా భారతదేశంలో నిర్మించుకోవడానికి గల కారణాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కోడలు, ఎన్కోర్ హెల్త్‌కేర్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా అంబానీ వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం, రాజకీయ సుస్థిరత, కుటుంబ బాధ్యత వంటి అంశాలే తనను స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశాయని ఆమె స్పష్టం చేశారు.గురువారం 'ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు ది యునైటెడ్ నేషన్స్' (IIMUN) నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాధికా అంబానీ మాట్లాడారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిన ఆమె, తాను భారత్‌కు తిరిగి వచ్చే నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని, ఎన్నికల ప్రచారం, నిరసనలతో రాజకీయంగా తీవ్ర గందరగోళం నెలకొని ఉందని వివరించారు. "ఆ సమయంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పరిస్థితులు చాలా గందరగోళంగా ఉండేవి" అని ఆమె అన్నారు.అదే సమయంలో భారతదేశంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా, ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని రాధికా తెలిపారు. బీజేపీకి బలమైన మెజారిటీ లభించడం, ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం, రిలయన్స్ జియో ప్రారంభం కావడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఆనాడు భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తుండగా, అమెరికా వృద్ధి కేవలం 2-3 శాతంగానే ఉందని గుర్తుచేశారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ప్రధాని నరేంద్ర మోదీ