
ఇంటర్నెట్‌డెస్క్: తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర అసమ్మతి నెలకొంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీపై పట్టు కోల్పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎదురుదెబ్బ తర్వాత నుంచి ఆమె మేనల్లుడు అభిషేక్
బెనర్జీపై ఇంతకాలం నెలకొన్న అసంతృప్తిని నేతలు వెళ్లగక్కుతుండటంతో ఈ పరిస్థితి ఎదురైంది. తాజాగా అభిషేక్‌పై తృణమూల్ (Trinamool) ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు.
సంతకాల ఫోర్జరీ కేసులో చివరి నిమిషంలో అభిషేక్ తనను న్యాయవాదిగా తొలగించి, అవమానించారని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దీదీకి అల్టిమేటం జారీ చేశారు. ‘మాతో ఉంటారా..? లేక అభిషేక్ వెంట ఉంటారా..?’’ అని అడిగారు. ‘‘నేను మమతాదీదీ (Mamata Banerjee) వెంటే ఉన్నాను. కానీ, ఆమె ఎవరి పక్షంలో ఉన్నారో తేల్చుకోవాలి’’ అని కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. సీనియర్లను గౌరవించడం రాని అభిషేక్ వల్లే పార్టీ ధ్వంసమవుతోందని చెప్పారు. అహంకారంతో తనకు తాను కింగ్‌లా అనుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందన్నారు.
రాజ్యసభ సభ్యత్వానికి టీఎంసీ ఎంపీ ప్రకాశ్ బరైక్ రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో రాజ్యసభకు రాజీనామా చేసిన మూడో టీఎంసీ ఎంపీ ఈయన. దీంతో ఎగువసభలో తృణమూల్ ఎంపీల బలం పదికి తగ్గింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.