
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో 24హెచ్ఎస్ ఫిట్నెస్ సెంటర్ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పంజాబీ సింగర్ గురురంధ్వాకు చెందిన జిమ్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులకు
తెగబడ్డారు. ఈ కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ సోషల్ మీడియా ద్వారా అంగీకరించారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌తో సింగర్ గురు రంధ్వాకు సాన్నిహిత్యం పెరుగుతోందని అందుకే దాడి చేసినట్లు వెల్లడించారు.
‘‘సల్మాన్ ఖాన్‌కు గురురంధ్వా బాగా దగ్గరవుతున్నాడు. అందుకే దిల్లీలోని అతడి జిమ్‌ను టార్గెట్ చేశాం. మా శత్రువులకు ఇదొక హెచ్చరిక మాత్రమే’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సోషల్ మీడియా పోస్టుపై ఆరాతీస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో జిమ్‌లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.