
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Chandra Babu Pawan kalyan Wishes to NBK: ఈ రోజు హీరో నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఆయన సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలయ్య తన పుట్టినరోజును క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులతో జరుపుకున్నారు. కేక్ కట్ చేసిన తర్వాత వారికి తినిపించారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆయనకు ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అటు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.బాలకృష్ణ సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు తన ట్వీట్లో తెలిపారు.
అటు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి .. బాలయ్య పెద్దల్లుడు నారాలోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్య అంటూ ట్వీట్ చేయడం విశేషం. అంతేకాదు అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్, క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్న హస్తం, హిందూపురం ప్రజా విజేత బాలా మావయ్య ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
అటు కూతురు నారా బ్రహ్మణితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు కొరటాల టీమ్ సభ్యులు, మైత్రీ మూవీ మేకర్స్ సహా పలువురు నిర్మాతలు, దర్శకులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘అఖండ 2’తో పలకరించారు. త్వరలో గోపీచంద్ మలినేని, కొరటాల శివ సినిమాలు లైన్లో ఉన్నాయి. గోపీచంద్ మలినేని సినిమా దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు కొరటాల శివ సినిమా నెక్ట్స్ మంత్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి లేదా సమ్మర్ లో రిలీజ్ చేసే ప్లాన్‌లో చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.