అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘సోల్ ఆఫ్ లెనిన్’ పేరుతో ఓ స్పెషల్ వీడియో సాంగ్ వచ్చింది. రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదల సందర్భంగా, ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియోని థియేటర్లలో ప్రదర్శించారు. ఇప్పుడు అఫీషియల్ గా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడొచ్చిన వీడియో సాంగ్ ఇంకొక ఎత్తు అనేలా ఉంది. అఖిల్ ను మాస్ గా చూపించడమే కాదు, ఆ పాత్రలోని వైలెంట్ యాంగిల్ ను కూడా ప్రజెంట్ చేశారు. ఇంకో పక్క ప్రేమ కోసం అతడు చేసే పోరాటాన్ని ఆవిష్కరించారు.* ‘అమ్మిలందరూ తట్టుకోండి.. మనోడు వస్తున్నాడు’.. అఖిల్ ‘లెనిన్’ టీజర్ చూశారా! రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూరల్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో 'ప్రేమ' ప్రధానాంశంగా ఉండబోతోందని ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో చూస్తే అర్థమవుతోంది. భాగ్యశ్రీతో అఖిల్ లవ్ స్టోరీ, ఆమె కోసం అందర్నీ ఎదురించి నిలబడటం వంటివి చూపించారు. భాగ్యశ్రీని బస్ లో రౌడీ మూకలు ఏడిపిస్తే, అఖిల్ వెళ్లి ఫైట్ చేయడం.. అలానే వందల కొద్దీ రౌడీలు అతడిపైకి వస్తుండగా, అఖిల్ ఒక్కడే తన పెట్ డాగ్ తో కలిసి వారిపై యుద్ధానికి బయలుదేరడం వంటివి హైలైట్ గా నిలిచాయి. ఇది సినిమాలో క్లైమాక్స్ ఫైట్ అనిపిస్తోంది. 'ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు' అనే క్యాప్షన్ తో, ప్రేమ కోసం లెనిన్ ఎలాంటి వైలెన్స్ కి పాల్పడబోతున్నాడనేది ఈ వీడియోలో శాంపిల్ గా చూపించారు. చివర్లో వేట కొడవలితో ఊచకోత కోసే షాట్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఇది చూసి అయ్యగారి విశ్వరూపం చూపించారని అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘సోల్ ఆఫ్ లెనిన్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ కంపోజ్ చేసిన బీజీఎమ్ గూస్ బమ్స్ తెప్పించేలా ఉంది. మురళీ కిషోర్ పిక్చరైజేషన్, దానికి తగ్గట్టుగా డీఓపీ లియోన్ బ్రిట్టో ఇచ్చిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అఖిల్, భాగ్యశ్రీ పెయిర్ బాగుంది.ఓవరాల్ గా అభిమానులు కూడా ఊహించని విధంగా ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో సాంగ్ ఉంది. ఇది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. చాన్నాళ్లుగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్.. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 జూన్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.