
భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రతిపాదన చేశారు. ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన 'సుఖోయ్-57'ను భారత్తో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి
భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రతిపాదన చేశారు. ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన 'సుఖోయ్-57'ను భారత్తో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు, ఉత్పత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ యుద్ధ విమానానికి సంబంధించిన పూర్తి సాంకేతికతను బదిలీ చేసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు.గురువారం రాత్రి అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న యుద్ధ విమానాల్లో SU-57 అత్యుత్తమమైనదని నేను భావిస్తున్నాను. ఈ ఐదో తరం విమానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని భారత మిత్రులకు మేం ప్రతిపాదించాం. ఈ విషయంలో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది, దీనిపై ఎటువంటి పరిమితులు ఉండవు" అని పుతిన్ వివరించారు.ప్రస్తుతం భారత్ 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐదో తరం ఫైటర్ జెట్ 'అడ్వాన్స్డ్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్' (AMCA)ను అభివృద్ధి చేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు 2035 నాటికి గానీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, మధ్యంతర అవసరాల కోసం రెండు స్క్వాడ్రన్ల (సుమారు 36) SU-57 విమానాలను కొనుగోలు చేసే దిశగా భారత ప్రభుత్వం యోచిస్తోంది.గతంలోనే భారత్, రష్యా కలిసి ఐదో తరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టును చేపట్టినప్పటికీ, సుమారు 30 బిలియన డాలర్ల భారీ వ్యయం కారణంగా 2021లో అది నిలిచిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా