
సినిమాల్లో పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం మన అందాల తారలకు కొత్త కాదు. ఈ క్రమంలోనే కచ్చితమైన ఆహార నియమాలతో పాటు వ్యాయామాల్నీ తమ జీవనశైలిలో భాగం చేసుకుంటారు. వీటితో పాటు తమ శారీరక అవసరాలకు
సినిమాల్లో పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం మన అందాల తారలకు కొత్త కాదు. ఈ క్రమంలోనే కచ్చితమైన ఆహార నియమాలతో పాటు వ్యాయామాల్నీ తమ జీవనశైలిలో భాగం చేసుకుంటారు. వీటితో పాటు తమ శారీరక అవసరాలకు తగినట్లుగా కొత్త వర్కవుట్లనూ ఫిట్నెస్ రొటీన్లో చేర్చుకుంటారు.
సినిమాల్లో పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం మన అందాల తారలకు కొత్త కాదు. ఈ క్రమంలోనే కచ్చితమైన ఆహార నియమాలతో పాటు వ్యాయామాల్నీ తమ జీవనశైలిలో భాగం చేసుకుంటారు. వీటితో పాటు తమ శారీరక అవసరాలకు తగినట్లుగా కొత్త వర్కవుట్లనూ ఫిట్నెస్ రొటీన్లో చేర్చుకుంటారు. ఇదేవిధంగా ‘కాక్టెయిల్-2’ సినిమా కోసం బాలీవుడ్ తార కృతీ సనన్ కూడా ఓ వ్యాయామం సాధన చేసిందట. అదే తనను ఈ సినిమా కోసం నాజూగ్గా మార్చేసిందంటూ తాజాగా కృతి ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
వెండితెరపై తన పాత్రల కోసం సాహసాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కృతి. బరువు పెరగడం, తగ్గడం కూడా ఇందులో ఓ భాగమే! గతంలో ‘మిమీ’ సినిమా కోసం ఏకంగా 15 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఆపై ఇదే సినిమాలోని ‘పరమ్ సుందరి’ పాట కోసం రెండున్నర నెలల్లోనే ఈ బరువును తగ్గించుకొని నాజూగ్గా మారింది. ఇక ఇప్పుడు మరోసారి వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుందీ బాలీవుడ్ భామ.
కృతి నటించిన ‘కాక్టెయిల్-2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర పోస్టర్లు, ట్రైలర్లో నాజూగ్గా, సన్నజాజి తీగలా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ సినిమాలో భాగంగా వెండితెరపై తొలిసారి బికినీ లుక్‌లో కనిపించనుందట కృతి. అయితే ఈ లుక్ కోసమే తాను స్లిమ్‌గా మారినట్లు.. దీనికోసం ఎంతో కష్టపడినట్లు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిందీ ముద్దుగుమ్మ.
‘నా ఫిట్నెస్ కోచ్ కరణ్‌తో ఈ సినిమా గురించి తొలిసారి మాట్లాడినప్పుడు.. చిత్ర దర్శకుడు నా పాత్రను ఎలా చూపించాలనుకున్నారో ఆయనకు వివరించా. ఇందులో నా పాత్ర కోసం కొన్ని బికినీ సీన్లు చేయాల్సి వచ్చింది. ఈ సన్నివేశాల్లో పూర్తిగా ఒదిగిపోయేలా నాజూకైన శరీరాకృతి ఉండాలన్నారు దర్శకుడు. అలాగని పూర్తిగా సైజ్ జీరో లుక్ కాకుండా.. కండలు కరిగిపోకుండా.. ముఖంలో కళ తగ్గకుండా స్లిమ్‌గా మారమన్నారు. ఇలా ఈ షరతులన్నీ కరణ్‌కి చెప్పా. నిజానికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అటు శారీరకంగా, ఇటు మానసికంగానూ సిద్ధం కావాలని కోచ్ చెప్పారు. ఇందులో భాగంగానే కొన్ని వ్యాయామాల్ని సాధన చేయించారు. ఈ క్రమంలోనే..
⚛ కఠినమైన స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు సాధన చేశాను.. ఫలితంగా చక్కటి శరీరాకృతిని, మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోగలిగా.
⚛ మధ్యస్థాయి తీవ్రత ఉన్న ఏరోబిక్స్ వంటి కార్డియో ఎక్సర్సైజుల వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడడంతో పాటు మానసికంగా అలసిపోకుండా జాగ్రత్తపడ్డా.
⚛ ఈ రెండు వ్యాయామాలు ఒకెత్తయితే.. ఇంక్లైన్ వాకింగ్ (ఏటవాలుగా ఉన్న ఉపరితలంపై నడక) మరో ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే కండరాల సామర్థ్యం తగ్గకుండా, శరీరంలోని కొవ్వులు కరిగి బికినీ శరీరాకృతిని సొంతం చేసుకోగలిగానంటే అది ఈ నడక వల్లే సాధ్యమైంది. వారానికి ఆరుసార్లు ఈ వ్యాయామం సాధన చేశా.
⚛ ఇలా బరువు తగ్గే క్రమంలో ముఖంలో మెరుపు, నిండుదనం తగ్గకుండా ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నా..’ అంటూ తన రొటీన్ గురించి చెప్పుకొచ్చింది కృతి. ‘వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం, స్థిరత్వం, క్రమశిక్షణ వల్లే కృతి తన పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగిందం’టూ కరణ్ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాదు.. ఈ వీడియో వైరలవడంతో నెటిజన్లు, అభిమానులు కూడా ఈ చక్కనమ్మ వృత్తి నిబద్ధతను కొనియాడుతున్నారు.
అయితే తాను బరువు తగ్గి నాజూగ్గా మారడానికి ఇంక్లైన్ వాకింగ్ వ్యాయామం ఎంతగానో దోహదపడిందని కృతి చెప్పడంతో.. అసలేంటీ వర్కవుట్ అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. పేరుకు తగినట్లుగానే ఇదీ ఓ రకమైన నడకే. ఏటవాలుగా ఉన్న ఉపరితలం లేదా ట్రెడ్‌మిల్‌పై నడవడమే ఈ వ్యాయామం. శారీరకంగా, మానసికంగా తక్కువ ఒత్తిడి పడుతూనే.. ఎక్కువ ప్రభావవంతంగా ఉండే ఈ నడక వల్ల పలు ఫిట్నెస్ ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.
⚛ చదునైన ఉపరితలంపై నడకతో పోల్చితే.. 10-15 శాతం ఏటవాలుగా ఉన్న ఉపరితలంపై నడవడం వల్ల శరీరంలో 50-70 శాతం అధిక క్యాలరీలు కరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
⚛ ఇంక్లైన్ వాకింగ్ వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి.. శారీరక కండరాలకు అవసరమైన ఆక్సిజన్, రక్తం, పోషకాలు అందుతాయి. ఇది ఇటు గుండె ఆరోగ్యానికి, అటు కండరాల సామర్థ్యానికీ మంచిదంటున్నారు నిపుణులు.
⚛ ఈ నడక వల్ల పిరుదుల్లోని ప్రధాన కండరాలు మరింత దృఢమవుతాయంటున్నారు నిపుణులు. అలాగే శరీరానికి వెనక వైపు ఉన్న కండరాలు తీరైన ఆకృతిలోకి వస్తాయని చెబుతున్నారు.
⚛ ఇంక్లైన్ వాకింగ్ వల్ల నడుం కింది శరీర భాగాలకు అంటే.. తొడ, పిక్క కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా అవి దృఢంగా మారి తీరైన ఆకృతిని సొంతం చేసుకుంటాయి. పియర్ షేప్ శరీరాకృతి ఉన్న వారికి ఈ వ్యాయామం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
⚛ ఈ వ్యాయామం వల్ల గాయాలవడం, కీళ్ల నొప్పులు.. వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు నిపుణులు.
⚛ జిమ్‌లో లేదంటే ట్రెడ్మిల్ ఉంటే ఇంట్లోనే దీన్ని సాధన చేయచ్చంటున్నారు నిపుణులు. వారానికి 3-4 సెషన్ల చొప్పున.. ప్రతి సెషన్‌ని 20-45 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేస్తే ఆశించిన ఫలితాలుంటాయని చెబుతున్నారు.
⚛ ఈ వ్యాయామాన్ని తొలిసారి సాధన చేసే వారు.. ట్రెడ్‌మిల్‌ను 5-8 శాతం ఏటవాలుగా అమర్చుకొని.. పావుగంట పాటు చేయాలి. ఆపై క్రమంగా ఏటవాలును, సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.
⚛ ఇలా నడిచే క్రమంలో ట్రెడ్మిల్ హ్యాండిల్స్‌ని పట్టుకోకూడదు. అప్పుడే శరీర భాగాలపై ఒత్తిడి పడి చక్కటి వ్యాయామం అందుతుందంటున్నారు నిపుణులు.
⚛ అలాగే ముందుకు వంగకుండా.. నిటారుగా నిలబడి నడక సాగించాలి.
⚛ ఇంక్లైన్ వాకింగ్ సాధన చేసే ముందు కొన్ని నిమిషాల పాటు సాధారణంగా నడవడం వల్ల శరీరం చురుగ్గా కదిలేందుకు అలవాటు పడుతుంది. ఆపై ఏటవాలుగా నడవడం సులువవుతుంది.
అయితే ఇది సులభమైన నడక పద్ధతే అయినా.. కొన్ని సెషన్లు ట్రైనర్ల సమక్షంలో సాధన చేయడం వల్ల.. ఆ తర్వాత సులభంగా ఎవరికి వారే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. గాయాల పాలు కాకుండా, ఇతర సమస్యలు తలెత్తకుండానూ జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.