
లోదుస్తులు.. తీరైన శరీరాకృతినిస్తూ, సౌకర్యాన్ని అందించే గార్మెంట్స్గానే వీటిని పరిగణిస్తాం. కానీ వీటిని ఎప్పుడైనా పరీక్షించి చూశారా? అందులోనూ ముఖ్యంగా ప్యాంటీస్ అడుగు భాగంలో డబుల్ లేయర్ క్లాత్
లోదుస్తులు.. తీరైన శరీరాకృతినిస్తూ, సౌకర్యాన్ని అందించే గార్మెంట్స్గానే వీటిని పరిగణిస్తాం. కానీ వీటిని ఎప్పుడైనా పరీక్షించి చూశారా? అందులోనూ ముఖ్యంగా ప్యాంటీస్ అడుగు భాగంలో డబుల్ లేయర్ క్లాత్ కుట్టి ఉంటుంది.. ఇక కొన్నింటికి ఇవి జేబుల మాదిరిగా కుట్టి వదిలేయడమూ చూస్తుంటాం.
లోదుస్తులు.. తీరైన శరీరాకృతినిస్తూ, సౌకర్యాన్ని అందించే గార్మెంట్స్గానే వీటిని పరిగణిస్తాం. కానీ వీటిని ఎప్పుడైనా పరీక్షించి చూశారా? అందులోనూ ముఖ్యంగా ప్యాంటీస్ అడుగు భాగంలో డబుల్ లేయర్ క్లాత్ కుట్టి ఉంటుంది.. ఇక కొన్నింటికి ఇవి జేబుల మాదిరిగా కుట్టి వదిలేయడమూ చూస్తుంటాం. అయితే కొంతమంది వీటిని గమనించినా పెద్దగా పట్టించుకోరు.. వీటి డిజైనే ఇలా ఉంటుందేమో అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదట! మరేంటో తెలుసుకుందాం రండి..
సాధారణంగా ప్యాంటీకి అడుగుభాగంలో అదనపు లేయర్ కుట్టి రావడం చూస్తుంటాం. కొన్ని ప్యాంటీస్కి ఇది జేబు మాదిరిగానూ ఉంటుంది. దీన్ని ‘ప్యాంటీ గసెట్’ అంటారు. ప్యాంటీ కోసం సింథటిక్, లేస్ ఫ్యాబ్రిక్స్ ఉపయోగించినా.. గసెట్ మెటీరియల్ మాత్రం పూర్తి స్థాయి కాటన్నే వాడతారట! ఆయా శరీర భాగాలకు సౌకర్యాన్ని, వ్యక్తిగత పరిశుభ్రతను అందించేందుకే పూర్తి స్థాయి కాటన్ మెటీరియల్‌ని వాడతారని చెబుతున్నారు నిపుణులు.
అయితే ప్యాంటీకి ఈ గసెట్ ఎందుకుంటుంది? అంటే.. దీనివల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.
⚛ కాటన్‌తో తయారుచేసిన ఈ గసెట్.. జననేంద్రియాల వద్ద వచ్చే చెమట, సాధారణంగా అయ్యే వైట్ డిశ్చార్జిని పీల్చుకుంటుంది. తద్వారా ఆ భాగం పొడిగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఫలితంగా వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట.
⚛ మృదువుగా ఉండే ఈ గసెట్ లేయర్ వల్ల చర్మానికి రాపిడి జరగదు.. తద్వారా వ్యక్తిగత భాగాల్లో దురద, మంట.. వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.. రోజంతా సౌకర్యంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.
⚛ ప్యాంటీ గసెట్ శరీరానికి గాలి తగిలేలా చేస్తుంది. ఫలితంగా ఆ ప్రదేశం పొడిగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇది జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందట. * సున్నితమైన చర్మతత్వం ఉన్న వారికి ఇది మరింత మేలు చేస్తుంది. నూలు, సిల్క్, సింథటిక్.. ఇలా ఎలాంటి దుస్తులు ధరించినా వాటివల్ల వ్యక్తిగత శరీర భాగాలకు రాపిడి జరగకుండా ఈ గసెట్ లేయర్ అడ్డుకుంటుందట.
⚛ ఈ గసెట్ వల్ల ప్యాంటీ నాణ్యత పెరుగుతుందని, తద్వారా ప్యాంటీ ఎక్కువ రోజులు మన్నుతుందని చెబుతున్నారు నిపుణులు.
ప్యాంటీ గసెట్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే ఈసారి లోదుస్తుల్ని కొనేటప్పుడు వాటికి ఈ పాకెట్ ఉందా? లేదా? అని పరిశీలించడం మర్చిపోవద్దు. అప్పుడే సౌకర్యంగా ఉండచ్చు.. ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.