
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన
Jun 5 2026 9:07 PM | Updated on Jun 5 2026 9:11 PM
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు.
అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్‌ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు