
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Super Star Vs Megastar: తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఈ ధసరా పండగ నిజంగానే మజాగా ఉండబోతుంది. ఈ సారి ఇద్దరు మేరు నగధీరులైన హీరోల మధ్య టఫ్ ఫైట్ చూడబోతున్నాం.. రజినీకాంత్ జైలర్ 2, చిరంజీవి విశ్వంభర సినిమాలు వరసగా ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ కాబోతున్నాయి. ‘జైలర్ 2’ మూవీ అక్టోబర్ 15న తేదిన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ వన్ డే గ్యాప్‌లో అక్టోబర్ 16న విడుదల కాబోతున్నట్టు సమాచారం. జైలర్ 2 మేకర్స్ రిలీజ్ డేట్ కన్పామ్ చేశారు. కానీ చిరంజీవి ‘విశ్వంభర’ మాత్రం రిలీజ్ డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు.
ఆల్మొస్ట్ దసరా బరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. గతంలో 2023 ఆగస్ట్ సీన్ మళ్లీ రిపీట్ కాబోతుంది. సరిగ్గా మూడేళ్ళ కింద 2023, ఆగస్ట్ 10న రజినీకాంత్ జైలర్, ఆగస్ట్ 11న భోళా శంకర్ సినిమాలు విడుదలయ్యాయి.. అప్పుడు చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీపై రజినీకాంత్ పై చేయి సాధించారు. ‘భోళా శంకర్’ సినిమాకు మెహర్ రమేష్ అనే పేరు మైనస్‌గా మారింది. పైగా రీమేక్‌లకు కాలం చెల్లిన ఈ సమయంలో చిరంజీవి.. అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాను రీమేక్ చేయడం. ఆ సినిమా తెలుగులో డబ్ వెర్షన్ రిలీజై అందరు చూసేడం జరిగింది.
పైగా ఓటీటీల్లో కూడా ప్రజలు అన్ని సినిమాలను ఆదిరస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘భోళా శంకర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా పడింది. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు విడులైన రజినీకాంత్ ‘జైలర్’ మూవీ సూపర్ హిట్ టాక్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘జైలర్ 2’ వర్సెస్ విశ్వంభర మూవీ రాబోతుంది. ఈ టైమ్‌లో చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే బ్లాక్ బస్టర్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు రజినీకాంత్ కూలీ వంటి యావరేజ్ మూవీ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘జైలర్ 2’ ఫ్యామిలీ యాక్షన్ రివేంజ్ డ్రామాగా రాబోతుంది. అదే విశ్వంభర సినిమా పూర్తి సోషియో ఫాంటసీ కథాంశంతో రాబోతుంది. చిరంజీవి కెరీర్లో ‘యముడికి మొగుడు’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ‘అంజి’ సినిమాల తర్వాత చిరు నుంచి రాబోతున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఈ సారి బాక్సాఫీస్ వార్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.